అచ్చమైన మేలిమి బంగారం 24 క్యారెట్లు ఉంటుందని తెలుసు.

అచ్చమైన మేలిమి బంగారం 24 క్యారెట్లు ఉంటుందని తెలుసు. ఆభరణాల తయారీకి 24 క్యారెట్ల బంగారం(Gold) సెట్టవ్వదు కాబట్టి 22 క్యారెట్ల బంగారంతోనో, 18 క్యారెట్ల బంగారంతోనూ ఆభరణాలు చేస్తారు. అంటే కాసింత రాగి కలుపుతారన్నమాట! ఇప్పుడు 24 క్యారెట్ల తులం బంగారం 73 వేల రూపాయలకు పైనే ఉంది. అదే 22 క్యారెట్ల తులం బంగారం ధర 68 వేల రూపాయలకుపైబడే ఉంది. వీటితో నగలు చేయించుకుని వేసుకోవాలన్నా భయమే! ఎక్కడ చైన్‌ స్నాచర్లు లాక్కేల్లిపోతారేమోనన్న భయం! ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం.. 2021తో పోలిస్తే, 2022లో దేశంలో చైన్‌ స్నాచింగ్‌ కేసులు 32.54 శాతం మేర పెరిగాయి. నగలు కొన్నది భద్రంగా బీరువాలోనో, బ్యాంక్‌ లాకర్లలోనో పెట్టుకోవడానికి కాదుగా! మరేమిటి మార్గం? అంటే తక్కువ ధరలో నగలు కొనడమే! ఇందుకో కేంద్రం 9-క్యారెట్ల బంగారాన్ని(9 carrats gold) తీసుకురాబోతున్నది. ఈ మేరకు బంగారు నగల వ్యాపారులతో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు భేటీ కూడా అయ్యారు. 9-క్యారెట్ల తులం బంగారం ధర పాతిక వేల రూపాయల నుంచి 30 వేల రూపాయల వరకు వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 24-క్యారెట్లు, 22-క్యారెట్ల బంగారం నాణ్యతను ధ్రువీకరించేందుకు ఉద్దేశించిన హాల్‌మార్క్‌, బీఎస్‌ఐ ముద్రలు(BSI) ఈ బంగారంపై కూడా ఉంటాయి. అంచేత నాణ్యత గురించి దిగులు అవసరం లేదు. వన్‌గ్రామ్‌ గోల్డ్‌ నగలు ధరిస్తే అది బంగారం కాదన్న విషయం తెలుస్తుంది. అదే 9-క్యారెట్ గోల్డ్‌ ఆభరణలు వేసుకుంటే గుర్తు పట్టడం చాలా కష్టం. అందుకే వినియోగదారులు కూడా ఇలాంటి బంగారు నగల కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలో వీరి ముచ్చట తీరే అవకాశం ఉంది.

Eha Tv

Eha Tv

Next Story