టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ట్రాయ్ (TRAI)సరికొత్త రూల్స్ ను అమలులోకి తెస్తుంది.మే 1 నుండి ఈ సరికొత్త విధానాన్ని అమలు చేయబోతుంది . పొద్దున్న లేచిన దగ్గర నుండి స్పామ్ కాల్స్(Spam Calls),మెసేజెస్ వీటి బెడదతో విసిగిపోతున్న వారికీ TRAI గుడ్ న్యూస్ చెప్పింది. ఇక పైన ఆ బెడద ఉండదు అంటూ ప్రకటన చేసింది . టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ద్వారా ఈ నియమం వచ్చే నెల నుండి అమలులోకి రానుంది TRAI ఫేక్(fake) ,స్పామ్ నంబర్లను(Spam Numbers) గుర్తించి నిరోధించే కొత్త ఫిల్టర్‌ను ఏర్పాటు చేస్తోంది, దీనితో మే 1,2023 తర్వాత ఫోన్‌లో నకిలీ కాలింగ్ తో పాటు స్పామ్ SMS ల బెడద తప్పుతుంది .

ఈ మేరకు ట్రాయ్ (TRAI)అన్ని టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. టెలికాం కంపెనీలు మే 1 నుంచి ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence)స్పామ్ ఫిల్టర్లను అందజేయనున్నాయి . నకిలీ కాల్‌లు ,సందేశాలు వినియోగదారుకు చేరకుండా నిరోధించడానికి ఈ ఫిల్టర్ పని చేస్తుంది. AI ఫిల్టర్‌ను(AI Filter) అందించే సదుపాయాన్ని టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్(Airtel) ప్రారంభించింది. ఫిల్టర్‌ను రాబోయే కొద్ది నెలల్లో జియో (Jio)కూడా AI ఫిల్టర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది . భారతదేశంలో AI ఫిల్టర్‌ల పరిచయం మే 1, 2023 నుండిమొదలవుతుంది .
ఫేక్ కాల్స్ , మెసేజ్‌లను ఆపడానికి TRAI చాలా కాలంగా ఒక నియమాన్ని తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తుంది . దీని ప్రకారం, 10 అంకెల మొబైల్ నంబర్ల నుండి వచ్చే ప్రమోషన్ కాల్‌లను నిషేధించాలని TRAI డిమాండ్ చేస్తోంది. దీనితో పాటు, TRAI కాలర్ ID ఫీచర్‌నుకూడా పరిచయంచేయాలనే పనిలో ఉంది. దీనిలో, ఫోన్ వచ్చినప్పుడు కాల్ చేసిన వ్యక్తి ఫోటో అలాగే పేరు కనిపిస్తాయి . దీనికి సంబంధించి, టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్(Airtel) ,జియో (Jio)సంస్థలతో ట్రూకాలర్ యాప్(True Caller App) గురించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. కానీ టెలికాం కంపెనీలు ప్రైవసీకి సంబంధించి కాలర్ ఐడీ ఫీచర్‌ను(Caller ID Feature) అమలు చేయడానికి సుముఖత చూపడంలేదని సమాచారం .