వర్షాకాలం వచ్చిందంటే వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ ఈ సీజన్‌లో కూరగాయలు మ‌రీ ఖరీదై సామాన్యుడి కిచెన్ బడ్జెట్‌ను పెంచుతాయి

వర్షాకాలం వచ్చిందంటే వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ ఈ సీజన్‌లో కూరగాయలు మ‌రీ ఖరీదై సామాన్యుడి కిచెన్ బడ్జెట్‌ను పెంచుతాయి. టమాటా ధర వారం రోజుల్లోనే కిలో రూ.80 దాటి రూ.100కి చేరింది. ప్రస్తుతం జ‌మ్ము క‌శ్మీర్‌లో టమాటా ధర రూ.100-120 వరకు ఉంది. మిగిలిన కూరగాయల ధరలు కూడా వారం క్రితం ఉన్న ధరల కంటే ఎక్కువగానే ఉన్నప్పటి.. వాటి ధరలు రూ.40 పైనే విక్రయిస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్‌లో రోజురోజుకు కురుస్తున్న వర్షాలే టమాటా ధరలు పెరగడానికి కారణమని చెబుతున్నారు. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా టమాటా పంటకు నష్టం వాటిల్లింది. అక్కడి నుంచి టమాటా రాక చాలా తక్కువగా ఉండడంతో వారం రోజుల్లో టమాటా ధర రూ.20 పెరిగింది.

జమ్మూలోని కొండ ప్రాంతాలలో టమాటా పంట ఇంకా సిద్ధంకాలేదు. అటువంటి పరిస్థితిలో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ నుండి టమోటాలు తక్కువగా రావడంతో ధరలు ఆకాశాన్ని తాకడం ప్రారంభించాయి. మరికొద్ది రోజుల్లో జమ్మూ జిల్లాలోని కొండ ప్రాంతాల నుంచి టమాట రాక ప్రారంభమవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ఆ తర్వాత మాత్రమే దాని ధర తగ్గుతుందంటున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే టమోటాలు, ఇతర కూరగాయల రాక దాదాపు 50 శాతం తగ్గిందంటున్నారు.

Eha Tv

Eha Tv

Next Story