భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు ఏప్రిల్ 17న నిఫ్టీ 17,700 వద్ద దిగువన ముగిశాయి.సోమవారం మార్కెట్‌లో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సూచీలలో విస్తృతమైన కొనుగోళ్లు జరిగినప్పటికీ, గత 9 రోజులుగా వరుసగా కొనసాగిన విజయాల పరంపరను సోమవారం మార్కెట్లు కొనసాగించలేకపోయాయి.

మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ Sensex520.25 పాయింట్లు లేదా 0.86 శాతం క్షీణించి 59,910.75 వద్ద, నిఫ్టీNifty 121.20 పాయింట్లు లేదా 0.68 శాతం క్షీణించి 17,706.80 దగ్గర ఉన్నాయి. దాదాపు 1,747 షేర్లు పురోగమించగా, 1.739 షేర్లు క్షీణించాయి అలాగే 180 షేర్లు మారలేదు.

నిఫ్టీలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, ఎన్‌టిపిసి ఇంకా లార్సెన్ అండ్ టూబ్రో ప్రధాన నష్టాల్లో ఉండగా, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎస్‌బిఐ, బ్రిటానియా ఇండస్ట్రీస్ లాభపడ్డాయి.

సెక్టోరల్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 4.7 శాతం, ఫార్మా ఇండెక్స్ 0.6 శాతం క్షీణించగా, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 3 శాతం, ఆయిల్ & గ్యాస్, రియల్టీ, ఎఫ్‌ఎంసిజి సూచీలు ఒక్కొక్కటి 1 శాతం పెరిగాయి.

బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్(BSE Midcap Index) 0.5 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ (BSE small cap index)0.15 శాతం పెరిగింది.

Updated On 17 April 2023 7:13 AM GMT
rj sanju

rj sanju

Next Story