ప్రస్తుతం లోన్ తీసుకునే పద్దతి చాలా సులభంగా మారిపోయింది. ఆకస్మాత్తుగా డబ్బు అవసరం వచ్చినప్పుడు ప్రజలు లోన్ తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇల్లు కొనుక్కోవడం దగ్గరి నుంచి పెళ్లి వరకు, చికిత్స కోసం అనేక అప్పులు చేస్తారు. కారు, గృహ రుణాలే కాకుండా.. వ్యక్తిగత రుణాల్ అంటే పర్సనల్ లోన్ తీసుకుంటారు. ఈ వ్యక్తిగత రుణం తీసుకోవడం చాలా సులభం. ఉద్యోగస్తులు కేవలం నిమిషాలలో పర్సనల్ లోన్ తీసుకుంటారు.

ప్రస్తుతం లోన్ తీసుకునే పద్దతి చాలా సులభంగా మారిపోయింది. ఆకస్మాత్తుగా డబ్బు అవసరం వచ్చినప్పుడు ప్రజలు లోన్ తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇల్లు కొనుక్కోవడం దగ్గరి నుంచి పెళ్లి వరకు, చికిత్స కోసం అనేక అప్పులు చేస్తారు. కారు, గృహ రుణాలే కాకుండా.. వ్యక్తిగత రుణాల్ అంటే పర్సనల్ లోన్ తీసుకుంటారు. ఈ వ్యక్తిగత రుణం తీసుకోవడం చాలా సులభం. ఉద్యోగస్తులు కేవలం నిమిషాలలో పర్సనల్ లోన్ తీసుకుంటారు. కానీ కొన్ని విషయాలు తెలుసుకోకపోతే మీరు సమస్యలలో పడ్డట్లే.. వ్యక్తిగత రుణం అన్ సెక్యూర్డ్ లోన్ అని చెప్పవచ్చు. అంటే బంగారం, గృహ రుణం వంటి ్తాకట్టు లేదా సెక్యూరిటీని డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ లోన్ రీపేమెంట్ వ్యవధి సాధారణంగా 12 నుంచి 60 నెలల వరకు ఉంటుంది.

అయితే పర్సనల్ లోన్ తీసుకునేవారు ముందుగా వడ్డీ రేటును తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఇతర రకాల రుణాలతో పోలిస్తే పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి 10 నుంచి 24 శాతం వరకు ఉండవచ్చు. వడ్డీ రేటు ఎక్కువ.. అలాగే EMI ఎక్కువే ఉంటుంది. అందులో లోన్ తీసుకునే ముందు వడ్డీ రేటు తక్కువగా ఉన్న బ్యాంకుల గురించి తెలుసుకోవాలి. అలాగే లోన్ తీసుకున్న తర్వాత ఈఎంఐ చెల్లింపు ఆలస్యం కాకుండా సకాలంలో చెల్లించేలా చూసుకోండి. ఎందుకంటే ఏరకమైనా రుణం తీసుకున్నా డిఫాల్ట్ చెల్లింపు మీపై ప్రభావం చూపిస్తుంది. అంటే సరైన సమయంలో చెల్లింపు చేయకపోవడమనేది మీ క్రెడిట్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అంటే మీ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది.

పర్సలన్ లోన్ తీసుకునేవారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం... ఈఎంఐ సరైన సమయానికి చెల్లించగలమా అనేది. ఎందుకంటే చాలాసార్లు అప్పుడ తలనొప్పిగా మారుతుంది. అందుకే సులభంగా వచ్చే ఈ లోన్ తీసుకునే ముందు మీకు అవసరమైనంత మాత్రమే తీసుకోండి. పర్సలన్ లోన్ తీసుకుంటున్నప్పుడు మీరు కాలానికి లోన్ తీసుకోవాలనుకుంటున్నారో కూడా గుర్తుంచుకోండి. ఎక్కువ కాలం పాటు రుణం తీసుకోవడం అంటే మీ నెలవారీ వాయిదా (EMI) తక్కువగా ఉంటుంది. కానీ మీరు దానిని చాలా కాలం పాటు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎక్కువ వడ్డీ చెల్లించాలి. మరోవైపు తిరిగి చెల్లించే వ్యవధిని తక్కువగా ఉంచినట్లయితే ఈఎంఐ ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. అయితే తగ్గించాల్సి ఉంటుంది. అందుకే అవసరమైనంత మాత్రమే పర్సనల్ లోన్ తీసుకోండి. అలాగే ఈ రుణం కోసం బ్యాంకులు, NBFCలు ఉన్నాయి. మీరు సౌలభ్యం ప్రకారం మీకు సరైన బ్యాంకును ఎంచుకోండి. ముఖ్యంగా రుణదాత వసూలు చేసే వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, కన్వీనియన్స్ ఫీజు, ఇతర ఛార్జీలను క్షుణ్ణంగా చెక్ చేయండి.

Updated On 6 Jun 2023 4:58 AM GMT
Ehatv

Ehatv

Next Story