No Tax Countries in World : ఈ దేశాల్లో ప్రజలు టాక్స్ కట్టనవసర్లేదు.. ఎక్కడో తెలుసా.!
దేశ ఆర్థిక వ్యవస్థ ,పరిస్థితులనిబట్టి అక్కడ ప్రజలు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. దేశ అభివృద్ధిలో పన్ను చెల్లింపు అనేది కీలక పాత్రను పోషిస్తుంది. ఇందులో ఆదాయపు పన్ను మరింత ముఖ్యమైనది. ప్రతి ఏడాది ఆర్థికవ్యవస్థకి అనుగుణంగా పన్నుల విషయంలో మార్పులు జరుగుతూ ఉంటాయి . తాజాగా జరిగిన బడ్జెట్ సమావేశాల్లో నిర్మల సీతారామన్ 7 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు జారీ చేయటం తెలిసిందే. ఎలా ఎవరైనా ఎక్కడ ఉన్న సరే సంపాదనకి […]
దేశ ఆర్థిక వ్యవస్థ ,పరిస్థితులనిబట్టి అక్కడ ప్రజలు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. దేశ అభివృద్ధిలో పన్ను చెల్లింపు అనేది కీలక పాత్రను పోషిస్తుంది. ఇందులో ఆదాయపు పన్ను మరింత ముఖ్యమైనది. ప్రతి ఏడాది ఆర్థికవ్యవస్థకి అనుగుణంగా పన్నుల విషయంలో మార్పులు జరుగుతూ ఉంటాయి . తాజాగా జరిగిన బడ్జెట్ సమావేశాల్లో నిర్మల సీతారామన్ 7 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు జారీ చేయటం తెలిసిందే. ఎలా ఎవరైనా ఎక్కడ ఉన్న సరే సంపాదనకి అనుగుణంగా పన్ను అనేది చెల్లించాల్సి ఉంటుంది. కాని కొన్ని దేశాల్లో మాత్రం ప్రజలకి అక్కడ ప్రభుతం పన్ను మినహాయింపు ఇవ్వటం జరుగుతుంది..అవి ఏ దేశాలంటే.?
చమురు నిలువలు ఎక్కువగా ఉండే యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్,ఒమాన్ ,కతార్ ,కువైట్,బ్రునై దేశ పౌరులు పన్ను చెల్లించనవసరం లేదు,పర్యాటకులతో నిత్యం రద్దీగా ఉండే ఒమాన్ దేశంలో ప్రజలకు కూడా పన్ను మినహాయింపు ఉంది. బీచ్ ,ప్రకృతి అందాలు,కేసినో వంటి ఆటల వలన నిత్యం పనామా ప్రాంతం పర్యాటకులతో నిండి ఉంటుంది. సోమాలియా,మొనాకో ,నౌరు దేశాల్లో పౌరులు పన్ను చెల్లించాల్సిన పని లేదు . దేశ ఆర్థిక ,ఇతర పరిస్థితులు,చమురు నిలువలు ఇలాంటి వివిధ రకాల పరిస్థితుల ఆధారంగా అక్కడ ప్రజలకి పన్నువిధానం అనేది ఉంటుంది. ఇది ఒక దేశానికి మరకోదేశానికి మధ్య బిన్నంగా ఉండచ్చు.
అలాగే మన భారత దేశంలో కూడా ఒక రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వానికి పన్ను కట్టాల్సిన అవసరం లేదు, ఆ రాష్ట్రం ఏదంటే సిక్కిం. కొన్ని పాత చట్టాలు,ప్రత్యేక హోదాలతో అప్పట్లో సిక్కిం భారత్ లో విలీనం అయింది. సిక్కింకి నాలుగు వైపులా సరిహద్దుగా భూటాన్,నేపాల్,పశ్చిమ బెంగాల్,టిబెట్ దేశాలు ఉన్నాయి. చుట్టూ కొండలతో ఎంతో అందంగా ఉంటాయి ఇక్కడి ప్రదేశాలు. 1948 INCOME TAX రూల్స్ ప్రకారం ఇక్కడి ప్రజలకి టాక్స్ కట్టనవసరం లేదు. అలాగే సిక్కిం పౌరులకు PANCARD కూడా అవసరం లేదు .