మూడవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా పేరు పొందిన టాటా మోటార్స్(Tata Motors) అమ్మకాలు ఈ ఏడాది రికార్డు స్థాయిలో పెరిగాయి . టాటా మోటార్స్ లో అన్ని కార్స్ కూడా మార్కెట్లో మంచి డిమాండ్ కలిగి ఉన్నాయి . ప్రజల్లో టాటాసంస్థకు నమ్మకానికి రూపంగా ఇప్పుడు మార్కెట్ లోకి మరో కొత్త మోడల్ ని పరిచయం చేస్తుంది . టాటా కంపెనీ ఎంట్రీ లెవల్ మోడల్ టాటా టియాగో(TATA Tiago) హ్యాచ్‌బ్యాక్ కారు . ఈ కారు ధర ,ఫీచర్స్ ,వంటి ఎన్నో విషయాలను ఇప్పుడు చూద్దాం .

కంపెనీ లైనప్‌లో టాటా టియాగో (Tata Tiago)అత్యంత తక్కువ ధర ఉన్న కారు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.5 లక్షలు. మార్చి 2022లో 4002 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యిన ఈ కారు గత నెలలో మాత్రం 7366 యూనిట్లు విక్రయించి కంపెనీ యొక్క థర్డ్ బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. .
టాటా టియాగో( Tata Tiago )మార్కెట్లో 6 ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది, వీటిలో XE, XM, XT(O), XT, XZ ఇంకా XZ+ ఉన్నాయి. వినియోగదారులు మిడ్‌నైట్ ప్లమ్, డేటోనా గ్రే, ఒపల్ వైట్, అరిజోనా బ్లూ , ఫ్లేమ్ రెడ్ వంటి 5 కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది . ఇది 242 లీటర్ల భారీ బూట్ స్పేస్‌ను కూడా కలిగి ఉంది . ఢిల్లీలో (Delhi)ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.5.54 లక్షల నుంచి రూ.8.05 లక్షల మధ్య ఉంది.
టాటా టియాగో(Tata Tiago) హ్యాచ్‌బ్యాక్‌లో(hatchback car) 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది . ఈ ఇంజన్ 86PS పవర్ తో 113Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఆప్షన్ తో వస్తుంది . ఈ కారు CNG సెలక్షన్ లో కూడా అందుబాటులో ఉంది, CNG మోడ్‌లో ఈ ఇంజిన్ 73PS పవర్ తో 95 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ తో మాత్రమేఉంటుంది . ఇది పెట్రోల్ MT వేరియంట్‌లో 19.01 km/l, పెట్రోల్ AMT వేరియంట్‌లో 19 km/l, CNGలో 26.49 km/k , NRG MT/AMT వేరియంట్‌లో 20.09 km/l మైలేజీని ఇస్తుంది .
లక్షణాలు
టాటా టియాగో(Tata Tiago )ఆపిల్(Apple) కార్ ప్లే అలాగే ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, LED DRLలతో ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, వైపర్‌లు, కూల్డ్ గ్లోవ్‌బాక్స్తో వెనుక డీఫాగర్ కలిగి ఉంది.
ఈ కారు మారుతి సుజుకి సెలెరియో(Maruti Suzuki's Celerio) కి కాంపిటేటర్ గా ఉంది. ఇది 1.0L, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇది ఒకటి.