స్టాక్‌మార్కెట్‌(Stock Market) ఇన్వెస్టర్లకు 2023 మధురానుభూతులు మిగిల్చింది. దాదాపు 82 లక్షల కోట్ల సంపదను ముదుపర్లకు స్టాక్‌మార్కెట్లు తెచ్చిపెట్టాయి. వరుసగా ఎనిమిది ఏళ్ల పాటు లాభాల బాటలో ఇవి పయనించాయి. 2023 ఆరంభంలో కొంత నష్టాలు చవిచూసినా.. తర్వాత పుంజుకున్నాయి. విదేశీ పెట్టుబడులతో(Investments) ఏప్రిల్‌ నుంచి ఈ సూచీలు పుంజుకున్నాయి. నిఫ్టీలోని 27 షేర్లు ఆల్‌టైం హైకి చేరాయి. నిఫ్టీలో 40కి పైగా సూచీలు 10 శాతం నుంచి 100 శాతం వరకు పెరిగాయి.

బాంబే స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో(Bombay Stock Exchange) ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.81.90 లక్షల కోట్ల సంపద పెరిగి రూ.364 లక్షల కోట్ల ఆల్‌టైం హైకి చేరింది. జూన్‌లో నిఫ్టీ(Nifty) 19,000 పాయింట్లు, సెప్టెంబరులో 20,000, డిసెంబరు 28న ఆల్‌టైం హై అయిన 21,801.45కు చేరింది. జూన్‌లో సెన్సెక్స్‌(Sensex) 64,000 పాయింట్లను దాటింది. జులైలో 67 వేల మార్క్‌ను తాకిన సెన్సెక్స్ ఈనెల 28 వరకు ఏకంగా 8 వేల పాయింట్లకుపైగా ఎగబాకి 72,484.34 వద్ద రికార్డు సృష్టించింది. 2023లో మొత్తం మీద నిఫ్టీ 18%, సెన్సెక్స్‌ 19% లాభాలను ఇచ్చాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పడిపోవడంతో లాభాలు గడించాయంటున్నారు. ఫారిన్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కూడా ఇందుకు కారణమంటున్నారు. డిసెంబర్‌ 6న చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 4 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువను నిఫ్టీ రికార్డ్‌ సృష్టించడం గమనార్హం.

ఇది ఇలా ఉండగా 2024లో మార్కెట్లు 8 శాతం నుంచి 10 శాతం వరకు మాత్రమే పెరిగే అవకాశాలున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ(HDFC) సెక్యురిటీస్‌ నివేదిక వెల్లడించింది. ఎన్నికల తర్వాత, ఫలితాలు, పూర్తి స్థాయి బడ్జెట్‌ వచ్చిన తర్వాతే స్టాక్‌ మార్కెట్‌ సూచీలపై ఓ అంచనాకు రావొచ్చని బిజినెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వడ్డీ రేట్లు, ద్రవ్వోల్బణం, అంతర్జాతీయమార్కెట్‌లపై ఆధారపడే సూచీల హెచ్చు, తగ్గుదలలు ఆధారపడి ఉన్నాయని బ్రోకరేజ్‌లు చెప్తున్నాయి.

Updated On 30 Dec 2023 2:50 AM GMT
Ehatv

Ehatv

Next Story