సోమవారంమార్కెట్లు నేడు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. గ్లోబల్ ఫైనాన్షియల్ సెక్టార్‌లో ఒత్తిడులు కారణంగా,అమెరికాలో ఆర్థిక మాంద్యం,బ్యాంకు రంగంలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ పతనం,యూరప్‌లోని స్విస్ బ్యాంక్ UBS క్రెడిట్ సూయిస్‌ను స్వాధీనం చేసుకోవడం వల్ల ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థలో పెట్టుబడిదారులు ఆందోళన లకు గురవ్వటం వలన మార్కెట్లలో భారీ అమ్మకాలను ప్రేరేపించింది.ఐటీ, మెటల్ వంటి కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉంది. దీంతో దేశీయ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 361 […]
సోమవారంమార్కెట్లు నేడు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. గ్లోబల్ ఫైనాన్షియల్ సెక్టార్‌లో ఒత్తిడులు కారణంగా,అమెరికాలో ఆర్థిక మాంద్యం,బ్యాంకు రంగంలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ పతనం,యూరప్‌లోని స్విస్ బ్యాంక్ UBS క్రెడిట్ సూయిస్‌ను స్వాధీనం చేసుకోవడం వల్ల ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థలో పెట్టుబడిదారులు ఆందోళన లకు గురవ్వటం వలన మార్కెట్లలో భారీ అమ్మకాలను ప్రేరేపించింది.ఐటీ, మెటల్ వంటి కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉంది. దీంతో దేశీయ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 361 పాయింట్లు నిఫ్టీ 111 పాయింట్లు కోల్పోయింది
బీపీసీఎల్, దివీల్ ల్యాబ్స్, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ లాభాల్లో కొనసాగుతుండగా.. బజాజ్ ఫిన్‌సెర్వ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్ వంటి షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.సోమవారం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లసై భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మార్ షేర్లు 5.6 శాతం వరకు క్షీణించాయి.
మార్కెట్ ప్రారంభం సమయం నుండే దూకుడుగా నష్టపోవటం జరిగాయి . ఇంట్రాడే సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లు వరకు నష్టాన్ని చూసింది . క్రమంగా కొనుగోళ్ళదారుల మద్దతుతోనెమ్మదిగా కోలుకొంది . ఈ రోజు నష్టాలు చుసిన కంపెనీ ల విషయానికి వస్తే బజాజ్ ట్విన్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.