గత కొద్ది రోజులుగా దేశీయ మార్కెట్లు లాభాలను చుస్తున్నాయి . బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి బెంచ్‌మార్క్ సూచీలు నిఫ్టీ (Nifty)17800 ఎగువన ఎనిమిది వరుస సెషన్‌లకు గ్రీన్‌లో ముగిశాయి
గత కొద్ది రోజులుగా దేశీయ మార్కెట్లు లాభాలను చుస్తున్నాయి . బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి బెంచ్‌మార్క్ సూచీలు నిఫ్టీ (Nifty)17800 ఎగువన ఎనిమిది వరుస సెషన్‌లకు గ్రీన్‌లో ముగిశాయి.
మార్కెట్ ముగింపులో, సెన్సెక్స్(Sensex) 235.05 పాయింట్లు లేదా 0.39 శాతం పెరిగి 60,392.77 వద్ద, నిఫ్టీ(Nifty) 90.10 పాయింట్లు లేదా 0.51 శాతం పెరిగి 17,812.40 వద్ద ఉన్నాయి. దాదాపు 2,013 షేర్లు పురోగమించగా, 1,390 షేర్లు క్షీణించాయి మరియు 115 షేర్లు మారలేదు.
నిఫ్టీలో దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఆటో, అదానీ ఎంటర్‌ప్రైజెస్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఐషర్ మోటార్స్ కంపెనీలు అత్యధికంగా లాభపడగా, పవర్ గ్రిడ్ కార్ప్, ఎన్‌టిపిసి, నెస్లే ఇండియా, ఒఎన్‌జిసి ,అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలు నష్టాన్ని చూశాయి .
ఆటో, ఫార్మా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సూచీలు 1-2 శాతం వరకు పెరగగా, ఎఫ్‌ఎంసిజి, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో కొన్ని అమ్మకాలు జరిగాయి.
బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్(BSE midcap index) 0.5 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ (BSE small cap index) 0.4 శాతం పెరిగాయి.
డాలర్ (Dolor)బలహీనపడటంతో బంగారం ధరలు బుధవారం స్థిరపడ్డాయి,స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు(spot Gold) 0.4 శాతం పెరిగి $2,010.23కి చేరుకుంది. U.S. గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం నుండి $2,024.30 లాభపడింది.