వారం మొత్తం కూడా ఒడిదుకులతో సాగిన స్టాక్ మార్కెట్ వారాంతం లో మాత్రం లాభాలతో నడుస్తుంది.ఆర్థిక సంక్షోభం కారణంగా అమెరికా, యూరప్ మార్కెట్లలో బ్యాంకింగ్ రంగం తీవ్ర అస్థిరతలకు లోనవటం భారత మార్కెట్లను ప్రభావితం చేసింది. గురువారం కూడా లాభాలతో ముగిసిన మార్కెట్.శుక్రవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభం అయింది .ఎట్టకేలకు పెట్టుబడి దారులు వారాంతంలో ఊపిరి పీల్చుకున్నారు .

మార్కెట్ మొదలయ్యే సమయానికి సెన్సెక్స్ 478 పాయింట్లు పెరిగి 58,113 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. . నిఫ్టీ 138 పాయింట్లు పెరిగి 17,114 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది . మార్కెట్లు ముగిసే సమయానికి కీలక బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 335 పాయింట్లు, నిఫ్టీ 114 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 465 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 94 పాయింట్ల లాభంలో ముగిసాయి.

ఈ రోజు స్టాక్ మార్కెట్ లో టాప్ గైనేర్ కంపెనీలు ;

హెచ్సీఎస్ టెక్, హిందాల్కొ, అల్ట్రాటెక్ సిమెంట్, యూపీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, నెస్లే, టాటా కన్జూమర్, టాటా స్టీల్, గ్రాసిమ్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, అదానీ ఎంటర్ ప్రైజెస్, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, బ్రిటానియా, ఎస్బీఐ స్టాక్స్ లాభాల్లో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

ఈ రోజు స్టాక్ మార్కెట్ లో నష్టపోయిన కంపెనీలు :

వారం చివరిలో మార్కెట్లు ముగిసే సమయానికి ఐషర్ మోటార్స్, ఎస్టీపీసీ, మారుతీ, ఐటీసీ, పవర్ గ్రిడ్, సిప్లా, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, హీరో మోటార్స్, టీసీఎస్, దివీస్ ల్యాబ్స్, హిందుస్థాన్ యూనిలివర్, రిలయన్స్ కంపెనీల షేర్లు నష్టాలను చూడటం జరిగింది .

మార్కెట్ ఓపెనింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 403 పాయింట్లు పెరిగి 58,038 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 126 పాయింట్లు పెరిగి 17,111 పాయింట్ల వద్ద స్థిరపడింది. వరుసగా ఐదు రోజుల నష్టాలు అనంతరం తిరిగి పుంజుకొని గురువారం సానుకూలంగా దేశీయ కీలక సూచీలు స్థిరపడ్డాయి. వారాంతం లో లాభాల్లో మార్కెట్ లు ముగిసాయి

Updated On 17 March 2023 6:30 AM GMT
Ehatv

Ehatv

Next Story