సంవత్సరంలో రెండుసార్లు మాత్రమే మనం ఈ గోల్డ్ బాండ్స్ పొందే అవకాశాన్ని ఇస్తుంది RBI మొదటి ఆర్థిక సంవత్సరానికి గాను మార్చి నెల 6 వ తేదీన ప్రారంభం అయిన subscription రేపటితో ముగియనుంది. ఈ బాండ్స్ కొనుగోలు కోసం ఆధార్‌కార్డు ,పాన్‌కార్డు తప్పనిసరిగా కావాలి ఆన్లైన్ ద్వారా లేదా పోస్ట్ఆఫీస్ల ద్వారా అప్లికేషన్ ని పూర్తి చేయాల్సి ఉంటుంది
సావరియన్ గోల్డ్ బాండ్ సబ్స్క్రిప్షన్ రేపటితో(మార్చి10 వ తేదీ ) ముగియనుంది.RBI ఆధ్వర్యంలో కొనసాగే ఈ గోల్డ్ బాండ్స్ అమ్మకం బ్యాంక్ అకౌంట్ నుంచి నిర్వర్తించుకోవచ్చు.. నవంబర్ 2015 lo ప్రారంభమైనప్పటి బంగారం ధర గ్రాము రూ . 2684 ఉండగా ప్రస్తుతం గ్రాము ధర రూ 5,561 గా ఉంది. బంగారం ని పెట్టుబడిగా చూసేవారికి డిజిటల్ రూపం లో బంగారం కొనుగోలు చేసుకొనేందుకు మరిన్ని ప్రయోజనాలు అందించేందుకు RBI ఈ సావరియన్ గోల్డ్ బాండ్స్ ని ప్రవేశపెట్టింది.. ఇక్కడ బంగారం కొనుగోలు చేసే వారికి గ్రాము పై 50 రూపాయల తగ్గింపుని ఇస్తుంది
డిజిటల్ పద్ధతిలో బంగారంను బాండ్ల రూపంలో మనంఇక్కడకొనుగోలు చేయవచ్చు..
ఈ బాండ్లను ఏ విధంగా కొనుగోలు చేయాలి అంటే బ్యాంకుల ద్వారా పోస్ట్ ఆఫీస్ లో ఎలాంటి స్టాక్ ఎక్స్చేంజి ప్లాట్ ఫామ్ నుంచైనా సరే మనం ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు . ఎవరైతే బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారు ఇలా డిజిటల్ విధానంలో కొనుగోలు చేసే గోల్డ్ బాండ్లు మంచి పెట్టుబడిగా ఉపయోగపడతాయి.
ఈ బాండ్లను నేరుగా ఒక్కరైనా కొనుగోలు చేయవచ్చు లేదా జాయింట్ అకౌంట్ ద్వారా అయినా కొనుగోలు చేయవచ్చు
బాండ్ల రూపంలో కొనుగోలు చేసే డిజిటల్హ్ గోల్డ్ కు ఇంట్రెస్ట్ కూడా జనరేట్ అవుతుంది. ఆర్.బి.ఐ నిర్ధారించే 2.5% వడ్డీ రేటు తో బాండ్లు కొనసాగుతాయి..
సావరియన్ గోల్డ్ బండ్ల కాలవ్యవధి 8ఏళ్ళు .5 సంవత్సరాల తర్వాత ఈ బాండ్స్ నుండి మనం ఎగ్జిట్ కావచ్చు..
ఈ సవరియాన్ గోల్డ్ బాండ్స్ ద్వారా మనం గ్రాము నుండి నాలుగు కేజీల వరకు విలువైన బంగారం డిజిటల్ బాండ్స్ రూపంలో కొనుగోలు చేయవచ్చు. 20 వేల రూపాయల వరకుక్యాష్ తో కొనుగోలు చేయవచ్చు.. ఆ తరువాత ఆన్లైన్ పేమెంట్ ద్వారా కొనుగోలు చేయాలి. నిర్దిష్ట సమయం తర్వాత ఈ బాండ్లను ద్వారా లోన్ కూడా తీసుకుని ఫెసిలిటీ ఉంది.