బంగారం ధరలు చుక్కలనంటి చాలా కాలమే అయ్యింది.
బంగారం ధరలు(Gold price) చుక్కలనంటి చాలా కాలమే అయ్యింది. ఇది పండుగల సీజన్ కాబట్టి, పెళ్లి(Marriage) ముహూర్తాలు కూడా వచ్చాయి కాబట్టి పసిడి మరింత ప్రియమయ్యింది. ఇప్పుడు తులం బంగారం 80 వేల రూపాయలు దాటింది. రికార్డు సృష్టించింది. దేశ చరిత్రలో ఇంతటి గరిష్టస్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో(Delhi bullion market) తులం బంగారం ధర ఒకే రోజు 750 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం 80,650 రూపాయలు పలుకుతోంది. మిడిల్ ఈస్ట్ దేశాలలో ఉద్రిక్తతలు, చైనా(china) వడ్డీ రేట్లను తగ్గించడంతో పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. తమ పెట్టుబడులు(Investments) ఈక్విటీ మార్కెట్ల(Eqity market) నుంచి బంగారం, వెండిపై(Silver) మళ్లించడంతో వీటి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. మరోవైపు వెండి ధర కూడా బాగా పెరిగింది. నాణేల తయారీదారులతోపాటు పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో కిలో వెండి ఏకంగా 5 వేల రూపాయలు పెరిగింది. ఒకేరోజు ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. గత శుక్రవారం రూ.94,500గా ఉన్న కిలో ధర సోమవారానికి 99,500 రూపాయలకు చేరుకున్నది. త్వరలో లక్ష రూపాయలు దాటొచ్చు. ఇలా బంగారం, వెండి ధరలు అమాంతం పెరగడం వెనుక చాలా కారణాలున్నాయి. సప్లయ్-డిమాండ్‌ల మధ్య అంతరం పెరగడంతోపాటు గనుల్లో ఉత్పత్తి పడిపోవడం, రీైస్లెకింగ్ రేట్లు(Recycling rates) అధికమవడం ప్రధాన కారణం. మరోవైపు ద్రవ్యోల్బణం పరిస్థితులూ మార్కెట్లో ధరల్ని ఎగదోస్తున్నాయి. పలు దేశాల కరెన్సీలు(cyrrency) బలోపేతం కావడం, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొనడం, చైనా వడ్డీరేట్లను పావుశాతం తగ్గించడంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లించడం ఇవన్నీ ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. 2007లో తులం బంగారం ధర పది వేల రూపాయలు ఉంటే ఇప్పుడు 80 వేల రూపాయలయ్యింది..