రిజ్వాన్ సాజన్ ముంబైలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు, ఆ కుటుంబంలో అతను చిన్నతనంలోనే చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు.

రిజ్వాన్ సాజన్(Rizwan Sajan) ముంబైలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు, ఆ కుటుంబంలో అతను చిన్నతనంలోనే చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. తన తండ్రి అకాల మరణం తరువాత, అతను 1981లో కువైట్‌కు వెళ్లి, అక్కడ ట్రైనీ సేల్స్‌మ్యాన్(Salesman)గా పనిచేశాడు. ఫుట్‌పాత్‌పై పుస్తకాలు విక్రయించాడు. సాజన్ తన సోదరీమణులతో కలిసి పాఠశాలకు చేరుకోవడానికి కొన్ని కిలోమీటర్లు నడిచేవాడు. అప్పుడు వారి ఇచ్చే ప్యాకెట్ మనీ మనీ పిల్లలందరికీ మొత్తం రూ. 15 మాత్రమే. 1993లో రిజ్వాన్ సాజన్ నిర్మాణ సామగ్రిలో ప్రత్యేకత కలిగిన డానుబే (Danube)గ్రూప్‌ను స్థాపించారు. కాలక్రమేణా, ఈ గ్రూప్ గృహాలంకరణ, రియల్ ఎస్టేట్ అభివృద్ధిలోకి ప్రవేశించి UAEలో ప్రముఖ వ్యాపారాలలో ఒకటిగా మారింది. నేడు, డానుబే సౌదీ అరేబియా, ఒమన్, బహ్రెయిన్, ఖతార్, భారతదేశం(India), ఇతర దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తూ, 10 బిలియన్ దిర్హామ్‌ల వార్షిక ఆదాయాన్ని ఆర్జిస్తోంది. రూ. 32 కోట్ల రోజువారీ ఆదాయంతో, సాజన్ దుబాయ్(dubai)లోని అత్యంత ధనవంతులైన భారతీయులలో ఒకరు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సేల్స్‌మ్యాన్‌గా ప్రారంభించిన తన జీవితాన్ని ఈ స్థాయికి వచ్చానని చెప్పుకున్నారు. సేల్స్‌మన్‌గా దానిని తన గొప్ప లక్షణంగా పేర్కొన్నాడు. విజయానికి సంపద అవసరం లేదని, నైపుణ్యాలు, పట్టుదల ముఖ్యమైనవని ఆయన నొక్కి చెప్పారు. "నేను నా డబ్బు మొత్తాన్ని కోల్పోయినా, నా వ్యాపార సామ్రాజ్యాన్ని మళ్లీ మొదటి నుంచి పునర్నిర్మించగలనని నాకు నమ్మకం ఉంది. ఆఫ్రికా అడవుల్లో కూడా డబ్బు సంపాదించగల వ్యక్తిని నేను" అని సాజన్ ప్రకటించాడు. "అదేవిధంగా, మీరు అదృష్టవంతులు అయినప్పటికీ మీరు కష్టపడి పనిచేయకపోయినా, మీరు విఫలమవడం ఖాయం" అని ఆయన తెలిపారు.
