ఇప్పుడంటే జేబులో పెన్నులు పెట్టుకుని ఎవరూ తిరగడం లేదు కానీ, ఒకప్పుడైతే పెన్ను కంపల్సరీ.. జేబులో పెన్ను లేకపోతే అదోలా ఉండేది. అది కూడా రేనాల్డ్స్ బాల్‌పెన్నే(Reynolds Pen) ఎక్కువ మంది జేబులో కనిపించేది. తొమ్మిదో దశకంలో రేనాల్డ్స్‌ పెన్‌ సృష్టించిన ట్రెండ్‌ మామూలుది కాదు.

ఇప్పుడంటే జేబులో పెన్నులు పెట్టుకుని ఎవరూ తిరగడం లేదు కానీ, ఒకప్పుడైతే పెన్ను కంపల్సరీ.. జేబులో పెన్ను లేకపోతే అదోలా ఉండేది. అది కూడా రేనాల్డ్స్ బాల్‌పెన్నే(Reynolds Pen) ఎక్కువ మంది జేబులో కనిపించేది. తొమ్మిదో దశకంలో రేనాల్డ్స్‌ పెన్‌ సృష్టించిన ట్రెండ్‌ మామూలుది కాదు. అప్పటి వరకు రాజ్యమేలిన ఇంకు పెన్నులను మూలకు విసిరేట్టు చేసింది. మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బాల్‌పాయింట్‌ పెన్‌(Ballpoint Pen) ఇదే! బ్లా క్యాప్‌, వైట్‌ కలర్‌ బాడతో మొదలైన ఈ పెన్ సెన్సేషన్ సృష్టించింది. అప్పట్లో ఉద్యోగస్తుల దగ్గర్నుంచి టీచర్లు, విద్యార్థుల వరకు రేనాల్డ్స్‌నే వాడేవారు. రేనాల్డ్స్‌ పేరుతో వచ్చిన ప్రాడక్టులలో బాల్‌పాయింట్‌ పెన్‌, జెల్‌, రోలర్‌బాల్‌, ఫౌంటెన్‌ పెన్‌, మెకానికల్‌ పెన్సిల్స్‌ ఇంకా చాలా ఉండేవి. బాధ కలిగించే విషయమేమిటంటే ఇప్పుడు రేనాల్డ్స్‌ పెన్‌ మార్కెట్‌లో నెమ్మదిగా మాయమవుతూ ఉండటం. రేనాల్డ్స్‌ పెన్‌ అంటే ఓ నోస్టాల్జియ ఓ చిన్ననాటి జ్ఞాపకం. ఇప్పుడా రెనాల్డ్స్‌ పెన్నుల కంపెనీ మూసివేస్తున్నారనే వార్త సోషల్‌ మీడియా(Social Media)లో చక్కర్లు కొడుతోంది. అప్పట్లో కేవలం అయిదు రూపాయలకు లభించే ఈ పెన్ను దేశంలో బాగా పాపులరయ్యింది. రెడ్‌, బ్లాక్‌, బ్లూ కలర్లలో వచ్చిన క్లాసిక్. అప్పట్లో ఖరీదైన పైలట్ పెన్నులతో పోలిస్తే దీని ధర చాలా తక్కువ. అందుకే సామాన్యులకు ఈజీగా అందుబాటులో వచ్చాయి. దీంతో తమకు ఇష్టమైన కలం ఉత్పత్తి ఆగి పోయిందనే విషాద వార్తపై నెటిజన్లు స్పందించారు. తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఇప్పటికీ ఈ పెన్‌ వాడుతున్నామంటూ కొందరు పేర్కొన్నారు. జాతీయ పెన్నుగా అభివర్ణించారు ఇంకొందరు. అయితే ప్రస్తుతం ఉన్న రెనాల్డ్స్ పెన్నుల చివరి బ్యాచ్ అమెజాన్‌లో అందుబాటులో ఉందంటూ మరికొందరు సూచించారు. దీనిపై రెనాల్డ్స్‌ వివరణ ఇచ్చుకుంది. సోషల్‌ మీడియాలో, వివిధ మీడియాలలో వస్తున్న వార్తలలో నిజం లేదని చెప్పింది. రేనాల్డ్స్‌కు భారతదేశంలో 45 ఏళ్ల వారసత్వం ఉందని, దాన్ని కొనసాగిస్తామని చెప్పింది.

Updated On 25 Aug 2023 5:21 AM GMT
Ehatv

Ehatv

Next Story