అమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ సేల్.. బంపరాఫర్లు..!

అమెజాన్ రిపబ్లిక్ డే సందర్భంగా బంపరాఫర్లు ప్రకటించింది.అన్ని కేటగిరీల ఉత్పత్తులపై భారీ తగ్గింపులను ప్రకటించింది. అందరు Amazon వ్యాపార కస్టమర్‌లు ప్రత్యేకమైన వ్యాపార ధరలు, బల్క్ డిస్కౌంట్‌లు, కొత్త లాంచ్‌లు, మరిన్నింటిని పొందవచ్చు. ఈ సేల్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీలో బెస్ట్ అండ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ కలిగిన వాటిని మీ సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ విషయానికొస్తే, మాన్యుమెంటల్ సేల్ జనవరి 14న ప్రారంభమవుతుంది, అయితే ప్లస్ మెంబర్‌లు ఒకరోజు ముందు అంటే జనవరి 13న సేల్‌కి యాక్సెస్‌ను పొందగలుగుతారు.
స్మార్ట్‌ఫోన్లు: అత్యాధునిక డిజైన్, సూపర్-ఫాస్ట్ A16 బయోనిక్ చిప్, అద్భుతమైన కెమెరా కలిగిన iPhone 14 / iPhone 14 Pro మెుబైల్స్ తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకువస్తున్నారు. శక్తివంతమైన ప్రాసెసర్, 100X జూమ్ కెమెరాతో వచ్చేసిన Samsung Galaxy S23 Ultra మెుబైల్ ఈ సేల్‌లో బెస్ట్ ఆఫ్షన్. ఫాస్ట్ ఛార్జింగ్ మరియు స్మూత్ టచ్ తో పనిచేసే OnePlus 11 5G తక్కువ ధరకే అందుబాటులో ఉంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ Apple , iQOO, OnePlus , Samsung, Xiaomi వంటి బ్రాండ్‌ల నుండి మొబైల్ ఫోన్‌లు మరియు సంబంధిత ఉపకరణాలపై 40 శాతం వరకు తగ్గిస్తున్నటట్లు ప్రకటించారు. స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలు, ప్రొజెక్టర్‌లపై 65 శాతం వరకు తగ్గింపును ప్రకటించగా.. ఇయర్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులు రూ. 199 నుండి ప్రారంభమవుతాయి. కంపెనీ ఎంపిక చేసిన అలెక్సా, ఫైర్ టీవీ ఉత్పత్తులను రూ. 2,599కి విక్రయిస్తుంది.
సేల్ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్‌లపై 60 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. SBI కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా రూ. 2,500 వరకు తగ్గింపు లభిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంటల్ సేల్
ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 16ని రూ. 63,999కి విక్రయిస్తుంది , ఇది ప్రస్తుత విక్రయ ధర రూ.74,900 నుంచి గణనీయమైన తగ్గింపు. Samsung Galaxy S24 Plus కూడా రూ. 59,999కి అందుబాటులో ఉంది, Apple iPad (1th Gen) రూ. 27,999కి విక్రయించబడుతుంది.
