తెలంగాణలో కాంగ్రెస్(Telangana congress) ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్‌ ఎస్టేట్‌(Real estate) వ్యాపారలావాదేవీలు తగ్గిపోయాయి.

తెలంగాణలో కాంగ్రెస్(Telangana congress) ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్‌ ఎస్టేట్‌(Real estate) వ్యాపారలావాదేవీలు తగ్గిపోయాయి. గతంలో మాదిరి క్రయ విక్రయాలు జరగడం లేదు. గతంలో ఓ వెలుగువెలిగిన రియల్‌ ఎస్టేట్‌ ఎందుకు కుదేలైంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత భూముల ధరలు తగ్గిపోతాయన్న వాదనలు అవాస్తవాలంటూ తెలంగాణలో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రభుత్వం వేలం వేసిన ఓ భూమి ఎకరం 100 కోట్లకు అమ్ముడుపోయింది. ప్రభుత్వం మారిన తరుణంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు స్తబ్దుగా మారాయి. ముఖ్యమంత్రి వచ్చిన రెండు, మూడు రోజుల్లోనే ఫార్మాసిటీ(Pharmacity) రద్దు అనేసరికి ఆయా చుట్టు ప్రాంతాల్లో రియల్‌ బూమ్‌ ఒక్క సారి ఢమాల్‌ మంది. ముఖ్యంగా హైడ్రా(Hydra) వచ్చిన తర్వాత అయితే ప్రజల్లో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎఫ్‌టీఎల్‌(FTL), బఫర్‌ జోన్ల(Buffer zone) పరిధిలో ఇళ్లు నిర్మించుకున్నారని హైడ్రా చాలా చోట్ల ఇళ్లను కూల్చివేసింది. మూసీ సుందరీకరణ(Musi bueatification) పేరుతో గత 30, 40 ఏళ్లు ఉంటున్న ఇళ్లకు నోటీసులు ఇచ్చారు. కొన్ని ఇళ్లను కూల్చారు కూడా.. కోర్టులు, ప్రజల్లో ఆగ్రహం వస్తుందనే టాక్‌ రావడంతో హైడ్రా కొంత వెనకడుగువేసింది. కానీ ప్రజల్లో భయాందోళనలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఓ వైపు కొత్త ప్రాజెక్టులకు అనుమతులు నిలుపుదల చేయడం, మరోవైపు ప్రజలకు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లపై సమాచారం లేకపోవడంతో కొత్త ప్రాజెక్టుల్లో ఫ్లాట్‌ల కొనుగోళ్లన్నీ నిలిచిపోయాయి. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఎస్‌ఎఫ్‌టీకి ఇంత అని వసూలు చేస్తున్నారని ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తిపోశాయి.

కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నవారు నో ఎఫ్‌టీఎల్, నో బఫర్ జోన్‌ అంటూ బోర్డులు ఏర్పాటు చేసుకుంటున్నారు. అంతేకాకుండా కస్టమర్లను ఆకర్షించేందుకు పలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చాయి. రియల్ ఢమాల్‌ అంటూ కొన్ని పత్రికల్లో వార్తలు కూడా రావడంతో ఇది నిజమని ప్రజలు నమ్ముతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్ల సమావేశంలో కేటీఆర్‌ వ్యాఖ్యలు కూడా ఇందుకు దోహదపడ్డాయి. రియల్‌ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది రియల్‌ ఎస్టేట్ ఏజెంట్లు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వానికి ఆదాయం కూడా తగ్గిపోవడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. రియల్‌ బూమ్ పుంజుకోడానికి ఏం చేస్తే బాగుంటుందని మల్లగుల్లాలు పడుతున్నారట.

మరోవైపు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తులతో మంత్రులు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో ఈనెలలో మంత్రులు భట్టి(Bhatti vikramarka), ఉత్తం(Uttam kumar), తుమ్మల, పొంగులేటి(Ponguleti srinivas) వరుస సమావేశాలు నిర్వహించారు. రియల్‌ ఎస్టేట్ వ్యాపారులకు నమ్మకం కలిగించేలా ఎలా ముందుకెళ్లాలో వారితో చర్చిస్తున్నారు. అంతే కాదు తాజాగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రియల్‌ వ్యాపారం పుంజుకోవాలంటే తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించినట్లు సమాచారం. రియల్ వ్యాపారం మళ్లీ పురోగమనంలోకి రావడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సమావేశం తర్వాత అయినా కానీ రియల్ జోరు అందుకోనుందా అనేది ఆసక్తిగా మారింది.

Eha Tv

Eha Tv

Next Story