నకు ఎప్పటి నుంచో వంట వండిపెడుతున్న కుక్ రజన్ షా(Rajan Shaw)కు ఆయన రూ.కోటి వీలునామా రాశారు.

తనకు ఎప్పటి నుంచో వంట వండిపెడుతున్న కుక్ రజన్ షా(Rajan Shaw)కు ఆయన రూ.కోటి వీలునామా రాశారు. అందులో రూ. 51 లక్షల రుణ మాఫీ కూడా ఉంది. ఇంటి పనులు చేసే సుబ్బయ్యకు రూ.66 లక్షలు, సెక్రటరీ డెల్నాజుకు రూ.18 లక్షలు రుణం మాఫీ చేశారు. తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకు ఎంబీఏ కోసం రూ.కోటి రుణాన్ని రతన్ టాటా మాఫీ చేశారు. పార్ట్ టైమ్ హెల్పర్లు, కార్ క్లీనర్లకు రూ. లక్ష పంపిణీ చేయాలని కూడా ఆయన వీలునామాలో రాశారు. ఇక తన దుస్తులను ఎన్జీవో సంస్థలకు విరాళంగా ఇవ్వాలని వీలునామాలో పేర్కొన్నారు. బ్రూక్స్ బ్రదర్ షర్టులు, హెర్మ్స్ టైలు, పోలో, డాక్స్, బ్రియోని సూట్లు వంటి బ్రాండ్లను రతన్ టాటా ధరించేవారు. రతన్ టాటా పెంపుడు జంతువు టిటో గురించి వీలునామాలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. జర్మన్ షెపర్డ్ కోసం ఆయన రూ. 12 లక్షలు కేటాయించారు. ప్రతి మూడు నెలలకు రూ.30వేల చొప్పున వాటికి ఖర్చే చేసేలా నిధులను ఇవ్వాలని పేర్కొన్నారు. కాగా రతన్ టాటాకు రూ.10వేల కోట్ల ఆస్తులుండగా, రూ.3800 కోట్లను దానధర్మాలకు ఇచ్చేశారు. 2022 ఫిబ్రవరి 23న రాసిన ఈ వీలునామా ప్రకారం ఆస్తుల కేటాయింపు జరగాల్సి ఉంటుంది.. ఇప్పటికే దీనిపై బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మరో ఆరు నెలల్లో ఈ ఆస్తుల పంపకం పూర్తి అయ్యే అవకాశం ఉంది.

ehatv

ehatv

Next Story