నగరవాసులు రోజూ ట్రాఫిక్ సమస్యతో తెగ ఇబ్బందిపడుతున్నారు. చినుకు పడిందంటే ఇక నరకమే! ట్రాఫిక్‌(Traffic) సమస్యకు తోడు వాయు కాలుష్యం. ఈ చికాకులకు చెక్‌ పెట్టడం ఎలాగో ప్రభుత్వాలకు తెలియడం లేదు. ఢిల్లీ ప్రభుత్వం(Delhi Govt) రెండు మూడు ప్రయోగాలు చేసినా వర్కవుట్‌ అవ్వలేదు.

నగరవాసులు రోజూ ట్రాఫిక్ సమస్యతో తెగ ఇబ్బందిపడుతున్నారు. చినుకు పడిందంటే ఇక నరకమే! ట్రాఫిక్‌(Traffic) సమస్యకు తోడు వాయు కాలుష్యం. ఈ చికాకులకు చెక్‌ పెట్టడం ఎలాగో ప్రభుత్వాలకు తెలియడం లేదు. ఢిల్లీ ప్రభుత్వం(Delhi Govt) రెండు మూడు ప్రయోగాలు చేసినా వర్కవుట్‌ అవ్వలేదు. కొన్ని కంపెనీలు ఎయిర్‌ టాక్సీ(Air Taxi)లను ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా ఈ సమస్యకు పరిష్కారం వెతుకుతోంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసి ప్రభుత్వం కూడా ఏర్పాటవుతోంది. ఈ క్రమంలో విమానయాన మంత్రిత్వ శాఖ కొత్త ప్రాజెక్టుపై ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎయిర్ ట్యాక్సీలను ప్రవేశపెట్టడానికి రోడ్‌మ్యాప్‌(Road Map)ను రూపొందించడానికి ఏవియేషన్ రెగ్యులేటర్(Aviation Regulator), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అనేక సాంకేతిక కమిటీలను ఏర్పాటు చేసింది. వచ్చే రెండేళ్లలో ఢిల్లీ(Delhi), ముంబాయి(Mumbai), బెంగళూరు(Bengaluru) వంటి ప్రధాన నగరాలలో ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత చెన్నై(Chennai), హైదరాబాద్‌(Hyderabad) వంటి ఇతర నగరాలలో మొదలవుతుంది. ఎయిర్ టాక్సీలో ప్రయాణమంటే తడిసి మోపడవుతుందనుకునేరు. అంత ఉండదట! ఉబర్‌ కంటే కొంత ఎక్కువగా ఉంటుందంతేనని అంటున్నారు. 2026 నాటికి భారతదేశంలో ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి రానున్నాయని ఇండిగో పేరెంట్ ఇంటర్‌ గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్ (IGE) అమెరికన్ ఎయిర్ టాక్సీ తయారీదారు ఆర్చర్ ఏవియేషన్‌ సీసీఓ నిఖిల్‌ గోయెల్‌(Nikhil Goel) అంటున్నారు. ఇందుకోసం ఆర్చర్‌కు చెందిన ఒక బృందం మొన్నామధ్యన భారతదేశంలోని విమానయాన అధికారులను కలిసింది. ఎయిర్‌ టాక్సీలు వస్తే ట్రాఫిక్‌ సమస్య నుంచి బయటపడవచ్చు. కాసింత సమయం కూడా చిక్కుతుంది. ఢిల్లీ నుంచి గుర్గావ్(Delhi to Gurgaon) వెళ్ళడానికి ఉబర్ 15 వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు తీసుకుంటోంది. ఎయిర్‌ టాక్సీలో వెళితే రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుందని ఇంటర్‌ గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్ చీఫ్‌ రాహుల్‌ భాటియా(Rahul Bhatia) అంటున్నారు. రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీలోని కన్నాట్ నుంచి గురుగ్రామ్(Connaught to Gurugram) చేరుకోవడానికి గంటన్నర పడుతుంది. ఈ 27 కిలోమీటర్ల దూరాన్ని ఎయిర్‌ టాక్సీ ద్వారా ఏడు నిమిషాల్లో చేరుకోవచ్చు. ఎయిర్‌ టాక్సీలు బ్యాటరీతో నడుస్తాయి. వీటిని పూర్తిగా చార్జ్‌ చేయడానికి అరగంట సమయం పడుతుందంతే. చూసేందుకు హెలికాప్టర్‌ల మాదిరిగానే ఉంటాయి. ఎయిర్ టాక్సీలో నలుగురు మాత్రమే ప్రయాణించవచ్చు.

Updated On 7 Jun 2024 4:35 AM GMT
Ehatv

Ehatv

Next Story