లంబోర్ఘిని Lamborghini లగ్జరీ కార్: లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీదారు లంబోర్ఘిని ఈరోజు ఇండియాలో కొత్త కారును లాంచ్ చేయబోతోంది,ఈ మోడల్ లంబోర్ఘిని ఉరుస్ S 2023(Lamborghini Urus S ).ఇది కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఇది కొత్త వేరియంట్‌గా ఉంటుంది. ముందు వచ్చిన కార్లతో పోలిస్తే ఇందులో చాలా కొత్త ఫీచర్లను చూడచ్చు. ఈ కొత్త లగ్జరీ కారు ఫెరారీ, బెంట్లీ, ఆస్టన్ మార్టిన్ వంటి కంపెనీల కార్లతో పోటీపడనుంది.
లంబోర్ఘిని Lamborghini లగ్జరీ కార్: లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని ఈరోజు ఇండియాలో కొత్త కారును లాంచ్ చేయబోతుంది,ఈ మోడల్ లంబోర్ఘిని ఉరుస్ S 2023(Lamborghini Urus S 2023).లంబోర్ఘిని కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఇది కొత్త వేరియంట్‌గా ఉంటుంది. ముందు వచ్చిన కార్లతో పోలిస్తే ఇందులో చాలా కొత్త ఫీచర్లను చూడచ్చు. ఈ కొత్త లగ్జరీ కారు ఫెరారీ, బెంట్లీ, ఆస్టన్ మార్టిన్ వంటి కంపెనీల కార్లతో పోటీపడనుంది.
లంబోర్ఘిని ఉరస్ S 2023 డిజైన్:
కారు డిజైన్ గురించి చెప్పాలంటే, ఇది ఉరుస్ పెర్ఫార్మంటే కంటే పవర్ఫుల్ గా ఉంటుంది . ఫ్రంట్ బంపర్‌లో ఈ మోడల్ లో చేంజ్ మనం చూడచ్చు అలాగే దీనికి కొత్త కార్బన్ ఫైబర్-పెయింటెడ్ బోనెట్ (carbon fiber-painted bonnet)ఇవ్వడం జరిగింది , దీనిలో మ్యాట్ బ్లాక్ ఎయిర్ వెంట్‌లు చాలా కొత్తగా అట్ట్రాక్టీవ్ గా కనిపిస్తాయి. క్యాబిన్ విషయానికి వస్తే, ఇది కొత్త ఇంటీరియర్ ట్రిమ్స్ తో ఇంకా కలర్ ఆప్షన్‌లతో వస్తుంది . ఈ కొత్త ఉరస్ S2023(Lamborghini Urus S )మోడల్ కూడా కార్బన్ ఫైబర్ రూఫ్‌ను కలిగి ఉంటుంది .
లంబోర్ఘిని ఉరస్ S 2023 ఇంజిన్:
ఈ కారు ఇంజన్ గురించి మాట్లాడితే, ఇది కొత్త 4.0-L ట్విన్-టర్బో 8 ఇంజన్‌లో వస్తుంది , ఇది 6,000 rpm వద్ద 657 BHP గరిష్ట శక్తిని అలాగే 2,300-4,500 rpm మధ్య 850 Nm అత్యధిక టార్క్‌ను ఇస్తుంది. అదే సమయంలో, ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్( speed automatic transmission) (AMT)తో జతచేశారు . కొత్త ఉరుస్ ఎస్ ,ఉరుస్ పెర్ఫార్మంటేలానే అదే పవర్ ఫిగర్‌ని(power figure )చేస్తుంది అలాగేఇది పాత ఉరస్ కంటే దాదాపు 14 బిహెచ్‌పి ఎక్కువ గా ఉంటుంది . బరువు పరంగా కూడా ఇది ఉరుస్ ఎస్ పెర్ఫార్మెంట్ కంటే దాదాపు 47 కిలోల ఎక్కువ బరువు ఉంటుంది .
లంబోర్ఘిని ఉరుస్ S 2023 స్పీడ్ , ధర:
కొత్త Urus S 0-100 km/h నుండి వేగవంతం కావడానికి 3.5 సెకన్లు పడుతుంది, ఇది Performante కంటే 0.2 సెకన్లు తక్కువ. మరియు దీని హైయెస్ట్ స్పీడ్ గంటకు 305 కి.మీ. ఈ లగ్జరీ కారులో మూడు ఆఫ్-రోడ్ డ్రైవింగ్ మోడ్‌లు (సబ్ బియా, నేవ్ , టెర్రా) అలాగే మూడు డ్రైవింగ్ మోడ్‌లు (స్ట్రాడా, స్పోర్ట్ ,కోర్సా) ఇవ్వబడ్డాయి. కొత్త లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌ను (Lamborghini Urus S 2023)ఇప్పటికే ఉన్న ఉరస్ పెర్ఫార్మెంట్ (Urus Performant)కంటే తక్కువ ధరలో పొందవచ్చు.
లంబోర్ఘిని ఉరుస్ ఎస్ 2023 (Lamborghini Urus S 2023)ఇమోడల్ ఫెరారీ రోమా, బెంట్లీ కాంటినెంటల్ జిటి, ఫెరారీ పోటోఫినో, ఆస్టన్ మార్టిన్ డిబి11, ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో, బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్, ఆస్టన్ మార్టిన్ డిబిఎక్స్ వంటి టాప్ మోడల్స్ తో పోటీపడనుంది.