ఆ మధ్యన బీహార్(Bihar)లో ఓ బ్రిడ్జ్‌ను దొంగలెత్తుకెళ్లిన వైనం గుర్తుంది కదా! వారి నుంచి ప్రేరణ పొందారో ఏమో కానీ బెంగళూరు నగరం నడిబొడ్డున ఉన్న ఓ బస్ షెల్టర్‌ను దొంగలించుకుపోయారు. ఆ బస్ షెల్టర్(Bus Shelter) నగర పోలీసు కమిషనర్ కార్యాలయానికి దగ్గరలోనే ఉండటం గమనార్హం.
ఆ మధ్యన బీహార్(Bihar)లో ఓ బ్రిడ్జ్‌ను దొంగలెత్తుకెళ్లిన వైనం గుర్తుంది కదా! వారి నుంచి ప్రేరణ పొందారో ఏమో కానీ బెంగళూరు నగరం నడిబొడ్డున ఉన్న ఓ బస్ షెల్టర్‌ను దొంగలించుకుపోయారు. ఆ బస్ షెల్టర్(Bus Shelter) నగర పోలీసు కమిషనర్ కార్యాలయానికి దగ్గరలోనే ఉండటం గమనార్హం. ఒక ప్రైవేటు సంస్థ విరాళంగా అందజేసిన పది లక్షల రూపాయలతో బెంగళూరు మెట్రో సిటీ బస్ సంస్థ దీనికి ఏర్పాటు చేసింది. స్థానిక కన్నింగ్‌హం రోడ్డులో ఏడాదిన్నర కిందట స్టీల్, ఇనుప రాడ్‌లు, షీట్లతో ఈ బస్ షెల్టర్‌ను నిర్మించింది. కొన్ని రోజులనుంచి అక్కడ బస్ షెల్టర్ లేకపోవడంతో అధికారులే తొలగించి ఉంటారని స్థానికులు అనుకున్నారు. అయితే విరాళం ఇచ్చిన ప్రైవేటు సంస్థకు ఎందుకో అనుమానం వచ్చి కార్పొరేషన్ అధికారులకు విషయం చెప్పారు. విషయం బయటకు రావడంతో వారం రోజుల కిందట స్థానికులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు.