ఏప్రిల్ నెల చివరి వారం వీకెండ్ లో మొదటి ట్రేడింగ్ సెషన్‌లో, భారత స్టాక్ మార్కెట్(National Stock Exchange) మెరుగైన లాభాలను ఇచ్చింది . ఇన్వెస్టర్ల భారీ కొనుగోళ్ల తో చాలా కాలం తరువాత సెన్సెక్స్ 61,000, నిఫ్టీ 18,000 మార్కును దాటాయి . ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్(Sensex) 463 పాయింట్ల లాభంతో 61,112 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(national Stock exchange) నిఫ్టీ(nifty)150 పాయింట్ల జంప్ తో 18,065 పాయింట్ల వద్ద ముగిశాయి.

స్టాక్ మార్కెట్‌లో వరుస లాభాలతో ఇన్వెస్టర్స్ సంపదలో , 2.50 లక్షల కోట్ల రూపాయలకు పైగా లాభం కనిపించింది. శుక్రవారం నాటి సెషన్‌లో బిఎస్‌ఇలో లిస్టయిన కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.271.71 లక్షల కోట్లకు పెరిగింది. నేటి సెషన్‌లో ఇన్వెస్టర్ల సంపద ఈ ఒక్క రోజులో రూ.2.64 లక్షల కోట్లు పెరిగింది.
నేటి ట్రేడింగ్‌లో బ్యాంకింగ్, ఆటో, ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసిజి, మెటల్స్, ఎనర్జీ, మీడియా, ఇన్‌ఫ్రా, హెల్త్‌కేర్, ఆయిల్, గ్యాస్ రంగాల షేర్లలో పెరుగుదల కనిపించింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సెక్టార్‌లోని స్టాక్స్ ఇండెక్స్ మాత్రమే ముగిసింది. నేటి ట్రేడింగ్‌లో నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.34 శాతం లేదా 390 పాయింట్ల లాభంతో ముగిసింది. స్మాక్ క్యాప్ ఇండెక్స్ స్టాక్స్ కూడా గొప్ప లాభాన్ని పోగుజేసాయి . సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 22 లాభాలతో ముగియగా, 8 నష్టాలతో ముగిశాయి. నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 41 స్టాక్స్ లాభాలతో ముగియగా, 9 స్టాక్స్ డౌన్‌లో ముగిశాయి.
లాభ పడ్డ షేర్ల వివరాలు
నేటి ట్రేడింగ్‌లో విప్రో 2.89 శాతం, నెస్లే 2.77 శాతం, ఎస్‌బిఐ 2.32 శాతం, ఐటిసి 2.24 శాతం, లార్సెన్ 2.24 శాతం, టెక్ మహీంద్రా 1.95 శాతం లాభంతో ముగిశాయి.
యాక్సిస్ బ్యాంక్(Axis BAnk) 2.39 శాతం, హెచ్‌సిఎల్ టెక్ (HCL Tech)0.75 శాతం, టైటాన్ కంపెనీtitan Company) 0.70 శాతం చొప్పున నష్టపోయాయి.