భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో పరుగులు పెడుతున్నాయి, ప్రారంభమైన దగ్గరనుంచియే కొన్ని షేర్లు మంచి లాభాల్లో పయనిస్తున్నాయి. ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 150 పాయింట్లకుపైగా పెరిగి 61 వేల 450 మార్కు వద్ద ఉండగా.. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 18 వేల 65 వద్ద ట్రేడవుతోంది. టెక్ మహీంద్రా, ఓఎన్‌జీసీ, అపోలో హాస్పిటల్, నెస్లే, అదానీ ఎంటర్‌ప్రైజెస్ వంటి సంస్థలు ట్రేడింగ్ లో […]

భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో పరుగులు పెడుతున్నాయి, ప్రారంభమైన దగ్గరనుంచియే కొన్ని షేర్లు మంచి లాభాల్లో పయనిస్తున్నాయి. ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 150 పాయింట్లకుపైగా పెరిగి 61 వేల 450 మార్కు వద్ద ఉండగా.. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 18 వేల 65 వద్ద ట్రేడవుతోంది. టెక్ మహీంద్రా, ఓఎన్‌జీసీ, అపోలో హాస్పిటల్, నెస్లే, అదానీ ఎంటర్‌ప్రైజెస్ వంటి సంస్థలు ట్రేడింగ్ లో బాగా రాణిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే బీపీసీఎల్, బజాజ్ ఫినాన్స్, హీరో మోటోకార్ప్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హెచ్‌యూఎల్ వంటి స్టాక్లు డీలా పడటంతో ఇన్వెస్టర్లు నిరాశలో ఉన్నారు.

ఊహించని విధంగా ఒక స్టాక్ మాత్రం ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ తీసుకొచ్చింది.అదే నహర్ పాలీ ఫిల్మ్స్ లిమిటెడ్ (Nahar Poly Films Limited). నహర్ పాలీ స్టాక్ 2021 ఫిబ్రవరి 16న రూ.90.35 వద్ద ఉండగా.. 14 ఫిబ్రవరి 2023 నాటికి రూ.229.60 గరిష్ట స్థాయిని తాకి ఇన్వెస్టర్లకు మంచి జోష్ ఇచ్చినది. ఈ రెండేళ్ల సమయంలో దాదాపు 150 శాతం పెరిగి కొత్త ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటుంది. రాబోయే రోజుల్లో ఈ స్టాక్ మరింత పెరిగే అవకాశం ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదే గ్రోత్ కొనసాగితే మాత్రం మరి కొద్ది రోజుల్లో దాదాపు రూ.300‏కు చేరే అవకాశముందంటున్నారు.

Updated On 17 Feb 2023 3:14 AM GMT
Ehatv

Ehatv

Next Story