అపజయం పొందిన ప్రతీ ఒక్కరు నిరంతర కృషితో మళ్లీ విజయాన్ని పొందుతారన్న విషయం మరోసారి రుజువైంది.
అపజయం పొందిన ప్రతీ ఒక్కరు నిరంతర కృషితో మళ్లీ విజయాన్ని పొందుతారన్న విషయం మరోసారి రుజువైంది. అతను ప్రపంచంలోని అత్యంత ఆస్తిపరుల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.. కానీ అనేక అపజయాలు, వరుస వైఫల్యాలతో అతలాకుతలమయ్యాడు. అప్పులపాలయ్యాడు.. కానీ ఇప్పుడు అతని కంపెనీలు అప్పుల ఊబి నుంచి బయటపడుతున్నాయి. ఒక్కో కంపెనీ పుంజుకుంటూ వస్తోంది. అతనే ముఖేష్ అంబానీ(Mukesh ambani) సోదరుడు అనిల్ అంబానీ(anil ambani). 2008లో 42 బిలియన్ డాలర్ల నెట్ వర్త్‌తో ప్రపంచంలోనే ఆరో స్థానంలో ఉన్నాడు. కానీ రిలయన్స్ క్యాపిటల్ దివాళా తీయడంతో రూ.21 వేల కోట్లు చెల్లించలేకపోయాడు. ఇక అనిల్ అంబానీ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ మళ్లీ లాభాల బాట పట్టారు.
నష్టాలు, అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీని ఆయన కుమారులు అన్‌మోల్, అన్షుల్ లాభాల్లోకి తీసుకువచ్చారు. అనిల్ అంబానీని అతని కుమారులు సగర్వంగా తలెత్తుకునేలా చేశారు. కుమారుల ప్రణాళికతో రిలయన్స్ పవర్ రూ.20,526 కోట్ల విలువైన కంపెనీగా నిలబడింది. రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్, రిలయన్స్ క్యాపిటల్ సంస్థలు కూడా లాభాల బాట పట్టడంతో కొడుకులను చూసి అనిల్ మురిసిపోతున్నారు. ఇదే ఉత్సాహంతో అనిల్ భూటాన్‌లో సోలార్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను చేపట్టారు.