కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా ?.. కానీ ఎలాంటి బిజినెస్. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం రాబట్టడం ఎలా అనే సందేహాలు కాస్త ఎక్కువే ఉంటాయి. అలాగే సీజన్స్ ప్రకారం కాకుండా.. ఏడాది పొడవునా మార్కెట్‌లో డిమాండ్‌ ఉండే వ్యాపారం మొదలుపెట్టడం ఉత్తమం. ఆహారం నుండి ఔషధాలు, బ్యూటీ ప్రొడక్ట్స్ వరకు అన్నింటిలో ఉపయోగించేది కొబ్బరి నూనె. కొబ్బరి నూనె వ్యాపారం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఉత్తమం.

కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా ?.. కానీ ఎలాంటి బిజినెస్. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం రాబట్టడం ఎలా అనే సందేహాలు కాస్త ఎక్కువే ఉంటాయి. అలాగే సీజన్స్ ప్రకారం కాకుండా.. ఏడాది పొడవునా మార్కెట్‌లో డిమాండ్‌ ఉండే వ్యాపారం మొదలుపెట్టడం ఉత్తమం. ఆహారం నుండి ఔషధాలు, బ్యూటీ ప్రొడక్ట్స్ వరకు అన్నింటిలో ఉపయోగించేది కొబ్బరి నూనె. కొబ్బరి నూనె వ్యాపారం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఉత్తమం. కొబ్బరి నుంచి నూనె తీసే వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉపయోగించేది కొబ్బరి నూనె. దీనిని వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి.. ఎలా కొనసాగించాలి.. ఈ వ్యాపారంలో ఉండే మెలకువలు ఏంటో తెలుసుకుందామా.

వ్యాపారం ఎలా ప్రారంభించాలి?
గ్రామంలో లేదా నగరంలో ఎక్కడైనా కొబ్బరి నూనె వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. దీని కోసం ముడి పదార్థంగా కొబ్బరి అవసరం ఉంటుంది. ఇది కాకుండా నూనెను వెలికితీసే ప్రక్రియ కోసం చెక్క ప్రెస్ మెషిన్, HP మోటార్, ఫిల్టర్ మెషిన్, నిల్వ ట్యాంక్ మొదలైనవి అవసరం. మీకు వీలైనట్టుగా దాని సెటప్‌ను సిద్ధం చేసుకోవాలి. నూనె సిద్ధమైన తర్వాత మార్కెట్‌లో ఎక్కడి నుంచైనా సరఫరా చేయవచ్చు.

కొబ్బరినూనెను తయారుచేయడం..
ముందుగా చెక్క ప్రెస్ మెషిన్‌లో కొబ్బరికాయను రుబ్బాలి. చాలా సేపు మెత్తగా రుబ్బిన తర్వాత దానిని దంచి నూనె తీస్తారు. ఈ సమయంలో నూనె చాలా వేడిగా ఉంటుంది. అందుకే అది చల్లబరచడానికి కొంత సమయం వరకు దానిని అలగే పక్కన పెట్టాలి.. చల్లారిన తర్వాత ఫిల్టర్ మెషీన్‌లో పెట్టి శుభ్రం చేయాలి. ఆ తర్వాత సీసా లేదా పెద్ద కంటైనర్‌లో నింపి మార్కెట్‌లో సరఫరా చేయాలి.

ఈ వ్యాపారంలో ఖర్చు, సంపాదన..
ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఇందుకోసం మీరు యంత్రాన్ని కొనుగోలు చేయడానికి చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ చిన్న తరహా వ్యాపారానికి సంబంధించిన యంత్రాలన్నీ రూ.5-7 లక్షలకే వస్తాయి. ఈ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించాలంటే రూ. 15-20 లక్షల వరకు ఖర్చు చేయవలసి ఉంటుంది. అయితే పీఎం ముద్రా లోన్ పథకం కింద ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి లోన్ కూడా తీసుకోవచ్చు. ఈ వ్యాపారం నుండి అన్ని ఖర్చులను తీసివేస్తే సంవత్సరానికి దాదాపు 3 లక్షల వరకు సంపాదించవచ్చు.

Updated On 9 Jun 2023 2:26 AM GMT
Ehatv

Ehatv

Next Story