బిడెట్ టాయిలెట్లు హైజీన్, సౌకర్యం కోసం ఈ టాయిలెట్లను ఆధునికంగా రూపొందించారు.

బిడెట్ టాయిలెట్లు హైజీన్, సౌకర్యం కోసం ఈ టాయిలెట్లను ఆధునికంగా రూపొందించారు. వీటిలో నీటి స్ప్రే ద్వారా శుభ్రపరచడం ప్రధాన లక్షణం.
నీటితో శుభ్రపరచడం వల్ల టాయిలెట్ పేపర్ కంటే మెరుగైన పరిశుభ్రత ఉంటుంది. వెచ్చని నీరు, స్ప్రే ప్రెషర్ అడ్జస్టబుల్‌గా ఉంటుంది. వెచ్చని సీట్లు, ఎయిర్ డ్రైయర్, రిమోట్ కంట్రోల్, నైట్ లైట్స్ ఉంటాయి. హెమరాయిడ్స్, చర్మ సమస్యలు ఉన్నవారికి సౌకర్యంగా ఉంటుంది. బిడెట్లు వివిధ రూపాల్లో వస్తాయి, అవసరాలు, బడ్జెట్, బాత్రూమ్ స్పేస్ ఆధారంగా ఎంచుకోవచ్చు: బిడెట్ సీట్లు: సాధారణ టాయిలెట్ సీట్‌ను రీప్లేస్ చేసే ఎలక్ట్రిక్ బిడెట్ సీట్లు. ఇవి సులభంగా ఇన్‌స్టాల్ చేయగలవు. ధర: రూ.10,000 - రూ.50,000. బిడెట్ ఫీచర్లు టాయిలెట్‌లోనే ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి. ఇవి ఖరీదైనవి, స్టైలిష్ డిజైన్‌తో వస్తాయి. ధర: రూ.50,000 - రూ.2,00,000
బిడెట్ టాయిలెట్లు అనేక అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వస్తాయి, ఇవి వాడకాన్ని సౌకర్యవంతం, సమర్థవంతంగా చేస్తాయి, సర్దుబాటు చేయగల నీటి ఒత్తిడి, ఉష్ణోగ్రత (Cool/Hot Water). రెండు రకాల స్ప్రే: పోస్టీరియర్ (Back) వాష్, ఫెమినిన్ (front) వాష్ ఉంటాయి. కొన్ని మోడల్స్‌లో పల్సేటింగ్/ఓసిలేటింగ్ స్ప్రే ఉంటుంది, ఇది శుభ్రపరచడంలో మరింత ఎఫెక్టివ్. సీట్ హీటింగ్ ఫీచర్, ముఖ్యంగా చలికాలంలో సౌకర్యంగా ఉంటుంది. ఉష్ణోగ్రత సెట్టింగ్‌లు సర్దుబాటు చేయగలవు. శుభ్రం చేసిన తర్వాత వెచ్చని గాలితో ఆరబెడుతుంది. టాయిలెట్ పేపర్ అవసరం తగ్గిస్తుంది. రిమోట్ కంట్రోల్ లేదా మొబైల్ యాప్ ద్వారా దీనిని నియంత్రించవచ్చు. ఆటో ఓపెన్/క్లోజ్ లిడ్, మోషన్ సెన్సార్లు కలిగి ఉంటుంది.రాత్రి ఉపయోగం కోసం LED లైటింగ్ సౌకర్యం ఉంటుంది. దుర్వాసన తొలగించడానికి ఎయిర్ ఫిల్టర్ సౌకర్యం. నీటితో శుభ్రపరచడం టాయిలెట్ పేపర్ కంటే ఎక్కువ పరిశుభ్రతను అందిస్తుంది. బ్యాక్టీరియా, చర్మ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. వృద్ధులు, గర్భిణీ స్త్రీలకు దీనిని వాడడం సులభమవుతుంది. చాలా బిడెట్ సీట్లు స్టాండర్డ్ టాయిలెట్లకు సరిపోతాయి. ఇంటిగ్రేటెడ్ టాయిలెట్లకు ఎక్కువ స్పేస్, ప్లంబింగ్ మార్పులు అవసరం కావచ్చు. నాజిల్స్ ఆటో-క్లీన్ అయినా, బయటి భాగాలను వారానికోసారి తడిగుడ్డతో తుడవాలి. కొన్ని మోడల్స్‌లో వాటర్ ఫిల్టర్ ఉంటుంది, దీన్ని 6-12 నెలలకోసారి మార్చాలి.
