MG మోటార్ ఇండియా తన అతి చిన్న ఆకర్షణీయమైన కొత్త ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకువచ్చింది ,ఈ సందర్భంగా కామెట్ EV ధరను మార్కెట్లో రివీల్ చేసారు . కామెట్ EV వెహికిల్(MG Comet EV) ప్రారంభ ధర కేవలం రూ. 7,98,000, అంటే ఇది టాటా టియాగో EV ధర కంటే తక్కువ. అయితే, ఇది ప్రారంభ ధర మాత్రమే . ఇప్పుడు కామెట్ ఈవీ దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారుగా చెప్పబడుతుంది . ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, MG కామెట్ EV కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ,ఈ వెహికిల్ ఒక నెల ఛార్జింగ్ ఖర్చు కేవలం రూ. 519 మాత్రమే .

ఈ ఎలక్ట్రిక్ కారును ప్రత్యేకంగా నగరాల్లో నడిపేందుకు పరిచయం చేశారు. 'బిగ్ ఇన్‌సైడ్, కాంపాక్ట్ అవుట్‌సైడ్' ఫిలాసఫీతో, MG కామెట్ EV( MG Comet EV)గురించిన అన్ని విషయాలను ఇప్పుడు చూద్దాం .

MG కామెట్ EV( MG Comet EV)స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ GSEV ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. దీనిబాడీ చాలా బలంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. 3 మీటర్ల కంటే తక్కువ పొడవుతో,అందంగా , ఆకర్షణియంగా కాంపాక్ట్ గా ఉన్న ఈ ఎలక్ట్రిక్ కారు LED DRLలు, LED హెడ్‌ల్యాంప్‌లు , టర్న్ ఇండికేటర్‌లతో పాటు LED టెయిల్‌ల్యాంప్‌లను కలిగి ఉంది . రెండు-డోర్ల మాత్రమే ఉండే ఈ బుల్లి కామెట్ EVలో 4 గురు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.

MG కామెట్ EV 17.3kWh లిథియం-అయాన్ బ్యాటరీతో పవర్ ని పొందుతుంది , ఇది ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 230 కిమీల పరిధిని అందించగలదు. కామెట్ EVలో 3 డ్రైవ్ మోడ్‌లు , 3 KERS మోడ్‌లు ఉన్నాయి. కామెట్ EV డ్రైవింగ్ చేయడానికి చాలా సున్నితంగా ఉంటుంది ఇంకా రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా సునాయాసంగా నడపగలము . 3.3 KW ఛార్జర్ సహాయంతో, MG కామెట్ EVని 7 గంటల్లో ఇంట్లోనే పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

MG కామెట్ EV ఫీచర్స్ గురించి చెప్పాలంటే , ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో , ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 55 కంటే ఎక్కువ కనెక్ట్ చేయబడిన కార్ ఫీచర్‌లతో iSmart, 100 కంటే ఎక్కువ వాయిస్ కమాండ్‌లు, డ్యూయల్‌ని కలిగి ఉంటుంది . ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS,ఫ్రంట్ అండ్ బ్యాక్ 3 పాయింట్ సీట్ బెల్ట్‌లు, బ్యాక్ పార్కింగ్ కెమెరా ఇంకా సెన్సార్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ,ISOFIX చైల్డ్ సీట్ అలాగే స్మార్ట్ స్టార్ట్ సిస్టమ్, డిజిటల్ బ్లూటూత్ కీ లాంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.

Updated On 26 April 2023 4:36 AM GMT
rj sanju

rj sanju

Next Story