కార్ల అమ్మకంలో నెంబర్ వన్ కంపెనీ మారుతీ సుజుకి(Marathi Suzuki )ప్రస్తుతం కొన్ని మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్ ని అందిస్తుంది . ప్రస్తుతం నడుస్తున్న ఈ ఆఫర్ కొన్ని కార్లకు మాత్రమే వర్తిస్తుంది . Nexa మోడల్స్‌లో Baleno, Grand Vitara, Ignis, Ciaz ఇంకా XL6 మోడల్స్ పైన ఈ తగ్గింపు కొనసాగుతుంది. ఏ కారుకు ఎంత వరకు డిస్కౌంట్ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం .
కార్ల అమ్మకంలో నెంబర్ వన్ కంపెనీ మారుతీ సుజుకి(Marathi Suzuki )ప్రస్తుతం కొన్ని మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్ ని అందిస్తుంది . ప్రస్తుతం నడుస్తున్న ఈ ఆఫర్ కొన్ని కార్లకు మాత్రమే వర్తిస్తుంది . Nexa మోడల్స్‌లో Baleno, Grand Vitara, Ignis, Ciaz ఇంకా XL6 మోడల్స్ పైన ఈ తగ్గింపు కొనసాగుతుంది. ఏ కారుకు ఎంత వరకు డిస్కౌంట్ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం .
మారుతీ సుజుకి బాలెనో(Baleno)
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లలో బాలెనో ఒకటి. ఈ కారుపై 10 వేల రూపాయల వరకు తగ్గింపు ను అందిస్తుంది . ఈ తగ్గింపు మారుతి సుజుకి బాలెనో యొక్క టాప్-స్పెక్ జీటా ఇంకా ఆల్ఫా వేరియంట్‌లకు మాత్రమే వర్తిస్తుంది . ఈ మోడల్ లో ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లతో పాటు హెడ్-అప్ డిస్‌ప్లేలో టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను కూడా పొందుతారు, అలాగే వైర్‌లెస్ Apple CarPlay ఇంకా Android Auto తో లభిస్తుంది
మారుతి సుజుకి గ్రాండ్ విటారా(Grand Vitara)
మారుతి లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. ప్రస్తుతం కంపెనీ ఈ కారుపై ఎలాంటి తగ్గింపును ఇవ్వటం లేదు. ఇది పెద్ద ఫ్రంట్ ఫాసియా, క్రోమ్-లైన్డ్ హెక్సాగోనల్ గ్రిల్, త్రీ-పాయింట్ LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, బంపర్-మౌంటెడ్ మెయిన్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్ వంటి ఫీచర్స్ తో అందుబాటులో ఉంది . 360-డిగ్రీ కెమెరాతో పాటు హెడ్-అప్ డిస్‌ప్లే, 9.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మధ్యలో పూర్తి-రంగు డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఇంకా ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.సేఫ్టీ ఫీచర్స్ కోసం, కారు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్-డీసెంట్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లతో అదరగొడుతుంది
మారుతీ సుజుకి ఇగ్నిస్(Ignis)
మీరు ఈ కారును కొనాలనుకుంటే , మారుతీ కంపెనీ ఈ కారుపై భారీగా 44 వేల రూపాయల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఈ కారు ఫీచర్లు ఇంకా డిజైన్ గురించి మాట్లాడితే, ఇగ్నిస్ 4 U- ఆకారపు క్రోమ్ ఇన్‌సర్ట్‌లతో కూడిన గ్రిల్, LED DRLలతో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, కాంట్రాస్ట్-కలర్ స్కిడ్ ప్లేట్లు, బ్లాక్-అవుట్ 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, యాంటెన్నా కలిగి ఉంటుంది . ఒక ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ కూడ కనిపిస్తుంది.
మారుతీ సుజుకి సియాజ్(Ignis)
సియాజ్ పై ఏప్రిల్‌లో రూ. 28,000 వరకు తగ్గింపును అందిస్తుంది . మారుతీకి చెందిన బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఇది కూడా ఒకటి. కొత్త సియాజ్ మూడు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో పెర్ల్ మెటాలిక్ ,ఓపులెంట్ రెడ్ విత్ బ్లాక్ రూఫ్, పెరల్ మెటాలిక్ గ్రాండియర్ గ్రే విత్ బ్లాక్ రూఫ్గ్ని,టీ బ్రౌన్ విత్ బ్లాక్ రూఫ్‌లలో అందుబాటులో ఉంది. సేఫ్టీపరంగా, ఇది చాలా బలంగా తయారు చేయబడింది. ఇది ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP),హిల్ హోల్డ్ అసిస్ట్ స్టాండర్డ్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్, ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్‌లు ఇంకా బ్యాక్ పార్కింగ్ సెన్సార్‌లను కూడా కలిగి ఉంది