భారతీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా ఆఫ్‌రోడర్ SUV మహీంద్రా థార్(Mahindra Thar) ధరలను ఇటీవల పెంచింది. భారతదేశంలో కొత్త RDE (రియల్ డ్రైవింగ్ ఎమిషన్) అలాగే BS6 స్టేజ్ 2 ఎమిషన్ నిబంధనలను అమలు చేసిన తర్వాత కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మహీంద్రా థార్ SUV యొక్క అన్ని వేరియంట్‌ల ధరలను పెంచటం జరిగింది . మహీంద్రా థార్ కొత్త ధరల ఇప్పుడు చూద్దాం .

భారతీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా ఆఫ్‌రోడర్ SUV మహీంద్రా థార్(Mahindra Thar) ధరలను ఇటీవల పెంచింది. భారతదేశంలో కొత్త RDE (రియల్ డ్రైవింగ్ ఎమిషన్) అలాగే BS6 స్టేజ్ 2 ఎమిషన్ నిబంధనలను అమలు చేసిన తర్వాత కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మహీంద్రా థార్ SUV యొక్క అన్ని వేరియంట్‌ల ధరలను పెంచటం జరిగింది . మహీంద్రా థార్ కొత్త ధరల ఇప్పుడు చూద్దాం .

మహీంద్రా థార్ కొత్త ధరలు
మహీంద్రా థార్ ఎస్‌యూవీ(SUV) ధరలను రూ. 1.05 లక్షల వరకు పెంచారు. అయితే, ఈ ధరల పెరుగుదల మహీంద్రా థార్ LX డీజిల్ హార్డ్ టాప్ MT RWD వేరియంట్‌పై మాత్రమే వర్తిస్తుంది. అదే సమయంలో, కంపెనీ తన AX (O) డీజిల్ హార్డ్ టాప్ MT RWD వేరియంట్‌ ధర రూ. 55,000 వరకు పెంచింది. మహీంద్రా థార్(Mahindra Thar) SUV యొక్క ఇతర వేరియంట్‌ల ధర కూడా ఇదే తరహాలో రూ. 28,200 వరకు పెరిగిందని చెప్పడం జరిగింది . అయితే కంపెనీ ఈ విషయం పై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు

మహీంద్రా థార్ (Mahindra Thar)RWD
మహీంద్రా థార్‌ను అందరి బడ్జెట్‌లో అందేలా చేయాలనే లక్ష్యంతో కంపెనీ తన RWD వేరియంట్‌ను తీసుకువచ్చింది . ప్రజలు కూడా బాగానే ఆదరిస్తున్నారు . థార్ 4X4తో పోలిస్తే దీని ధర చాలా తక్కువ. మీరు మహీంద్రా థార్ RWDని రూ. 10 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలు చేయవచ్చు. 4×4 థార్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ వెయిటింగ్ పీరియడ్‌ను కూడా కలిగి ఉంది.

ఇంజిన్ ఆప్షన్స్
పవర్‌ట్రెయిన్‌ల పరంగా, మహీంద్రా థార్ SUV మూడు ఇంజన్ ఆప్షన్స్ తో వస్తుంది. RWD మోడల్ స్మాల్ 1.5-లీటర్ 4-సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌ తో ఉంటుంది . ఈ ఇంజన్ 115bhp పవర్ అలాగే 300Nm టార్క్ ని ఇస్తుంది . ఇంకా, ఈ పవర్‌ట్రెయిన్ ప్రత్యేకంగా 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.

4WD వేరియంట్‌లో 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ 130bhp పవర్ అలాగే 300Nm టార్క్ ఇస్తుంది . ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది.

ఇది RWD ఇంకా 4WD ట్రిమ్‌లలో 2.0-లీటర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను తో ఉంటుంది . ఈ ఇంజన్ 150బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. గేర్‌బాక్స్ ఆప్షన్స్ల లో 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉన్నాయి.

Updated On 14 April 2023 6:40 AM GMT
rj sanju

rj sanju

Next Story