కేంద్ర ప్రభుత్వం(central government) మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకువస్తుంది. మహిళలను ప్రోత్సహించడం కోసం వాళ్ళు ఆర్థికంగా అని రంగాల్లోనూ స్థిరపడటం కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో స్వయం ఉపాధి(Self Employment) దిశలో ఎంతోమంది స్త్రీలు(women)ప్రయోజనాలు పొందుతున్నారు.. సంక్షేమ పథకాలలో స్త్రీ ,శిశు అన్ని వర్గాల వారికి సంబంధించిన పథకాలతో అనేకమంది ప్రయోజనాలు పొందుతున్నారు
కేంద్ర ప్రభుత్వం(central government) మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకువస్తుంది. మహిళలను ప్రోత్సహించడం కోసం వాళ్ళు ఆర్థికంగా అని రంగాల్లోనూ స్థిరపడటం కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో స్వయం ఉపాధి(Self Employment) దిశలో ఎంతోమంది స్త్రీలు(women)ప్రయోజనాలు పొందుతున్నారు.. సంక్షేమ పథకాలలో స్త్రీ ,శిశు అన్ని వర్గాల వారికి సంబంధించిన పథకాలతో అనేకమంది ప్రయోజనాలు పొందుతున్నారు.. ఇంటి దగ్గరే వ్యాపారం చేసుకునే మహిళలకు కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా రుణాలను మంజూరు చేస్తూ వారిని ప్రోత్సహిస్తుంది.. ఇప్పటికే ముద్ర లోన్(Mudra Loan) తో ఎంతోమంది స్త్రీలు ఆర్థికంగా ఆసరాను పొందుతూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.. ఈ పథకాలలో 50 వేల దగ్గర నుంచి 5 లక్షల వరకు మనం రుణాన్ని పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.. ఐదు లక్షల వరకు రుణాలను స్త్రీలకు అందించడంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఆసరాను కల్పిస్తుంది.
ఇప్పుడు ఇదే తరహాలోబడ్జెట్ సమావేశల అనంతరం (budget meetings) మహిళలు పెట్టుబడిలో భాగస్వామ్యానికి పెంచడానికి ఆర్థికంగా మరింత బలోపేతం చేయడానికి మరో పొదుపు పథకాన్నిమహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది దాని పేరే మహిళా సమాన్ సేవింగ్స్ స్కీం(Mahila Samman Savings scheme) .
ఈ స్కీంscheme కి ఎవరు అర్హులు ఈ స్కీం వల్ల ప్రయోజనాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం…మహిళా సమాన్ సేవింగ్ ఖాతాను (Mahila Samman Saving)పోస్ట్ ఆఫీస్(post office) లేదా ఏదైనా అధికార బ్యాంకులో(bank) ఖాతా తెరుచుకోవచ్చు .
మహిళా సమాన్ సేవింగ్స్ పథకాన్ని' ఆడవాళ్లు తమకోసం లేదంటే ఇంట్లో పెరుగుతున్న ఆడపిల్ల కోసమైనా సరే ఈ ఎకౌంటుని తెరిచే అవకాశం ఉంటుంది మార్చి 31 2025 లోపు ఈ పథకం లో జాయిన్ కావటానికి ఫారం-1 నింపాల్సి ఉంటుంది. ఈ పథకంలో కనీసం వెయ్యి రూపాయల(1000) నుంచి ఎంతవరకైనా జమ చేసుకోవచ్చు గరిష్ట పెట్టుబడి పరిమితి రెండు లక్షలుగా(2lakhs) పేర్కొనడం జరిగింది
ఈ పథకంలో మనం పొదుపు చేసే డబ్బుపై సంవత్సరానికి 7.5% వడ్డీ లభిస్తుంది డిపాజిట్ (deposit)చేసిన తేదీ నుంచి రెండు సంవత్సరాల తర్వాత మాత్రమే డిపాజిట్ అనేది మెచ్యూరిటీ(meturity) చెందుతుంది..ఈ స్కీం నుంచి సంవత్సరం తర్వాత కానీ ఖాతా మెచ్యూరిటీ ముగిసిన తర్వాత గాని మనం ఎప్పుడైనా డబ్బుని విత్ డ్రా(with draw) చేసుకోవచ్చు..పొదుపు మొదలైన సంవత్సరం తర్వాత గరిష్టంగా 40% శాతం వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుందిఎకౌంటు(account) తెరిచిన దగ్గరనుంచి ఆరు నెలల తర్వాత ఏ సమయంలోనైనా ఎకౌంటు ముందుగా మూసి వేయడానికి అనుమతించబడుతుంది . అకౌంట్లో అంతవరకు ఉన్న డబ్బుకు మాత్రమే వడ్డీ(intrest) లభిస్తుంది.. వడ్డీ రేటు కూడా రెండు శాతం(2%) తక్కువగా ఉంటుంది.