ఒకప్పుడు సైకిల్‌(Cycle) ఉన్నవాడు చాలా గొప్పోడు.. వరకట్నంగా(Dowry) సైకిల్‌ను ముచ్చటపడి తీసుకున్న అల్లుళ్లు ఎందరో! అసలు సైకిల్‌ అంటేనే ప్రిస్టేజ్‌ సింబల్‌.. అప్పుడేమో సైకిల్ ఓ అవసరం. ఇప్పుడేమో కొవ్వు కరిగించుకోవడానికి అదో వరం.. సరే ఈ ఉపోద్ఘాతమంతా ఎందుగ్గాని.. అసలు విషయానికి వద్దాం.. ఇప్పటికీ చాలా దేశాలలో సైకిల్‌ వినియోగం ఉంది. ఇది గమనించే కార్ల తయారీ సంస్థలు కూడా సైకిల్‌ను తయరు చేస్తున్నాయి.

ఒకప్పుడు సైకిల్‌(Cycle) ఉన్నవాడు చాలా గొప్పోడు.. వరకట్నంగా(Dowry) సైకిల్‌ను ముచ్చటపడి తీసుకున్న అల్లుళ్లు ఎందరో! అసలు సైకిల్‌ అంటేనే ప్రిస్టేజ్‌ సింబల్‌.. అప్పుడేమో సైకిల్ ఓ అవసరం. ఇప్పుడేమో కొవ్వు కరిగించుకోవడానికి అదో వరం.. సరే ఈ ఉపోద్ఘాతమంతా ఎందుగ్గాని.. అసలు విషయానికి వద్దాం.. ఇప్పటికీ చాలా దేశాలలో సైకిల్‌ వినియోగం ఉంది. ఇది గమనించే కార్ల తయారీ సంస్థలు కూడా సైకిల్‌ను తయరు చేస్తున్నాయి. లంబోర్ఘిని(Lamborghini) పేరు తెలుసుగా.. ఇటలీకి చెందిన సూపర్‌ కార్ల తయరీ సంస్థ అది. లంబోర్ఘినీ లగ్జరీ కార్లను కొనడం అందరివల్లా కాదు. ఈ సంస్థ ఖరీదైన కార్లనే(Costly cars) తయరు చేస్తుందని అనుకుంటారు కానీ సైకిల్స్‌(Cycles) కూడా విడుదల చేస్తుంది.

ఈ నేపథ్యంలో ఆ కంపెనీ ఇప్పుడు మార్కెట్లో ఓ సైకిల్‌ను విడుదల చేసింది. ఈ సైకిల్‌ రెండు వేరియంట్లలో లభిస్తోంది. రేస్‌ మ్యక్స్‌ ఎక్స్‌ ఆటోమొబిలి(Race Maxx Automobiles) లంబోర్ఘిని మొదటిది.. ఇది 9,899 డాలర్లకు లభిస్తుంద. మన కరెన్సీలో చెప్పాలంటే 8 లక్షల 15 వేల 365 రూపాయలు.. రెండో వేరియంట్‌ స్ట్రాడా ఎక్స్‌ ఆటోమొబిలి(Strada X Automobile) లంబోర్ఘిని.. దీని ధర 8,999 డాలర్లు. ఇండియన్‌ కరెన్సీలో 7 లక్షల 41 దేల 226 రూపాయలు.. ఈ సైకిల్స్‌ విడుదల చేయడానికి కంపెనీ ప్రత్యేకంగా 3టి అనే సంస్థతో కొలబరేట్‌ అయ్యింది.

ఈ తాజా లంబోర్ఘినీ సైకిల్స్‌ 51, 54,58 సెంటీమీటర్ల లిమిటెడ్‌ సైజుల్లో మాత్రమే దొరుకుతాయి. అన్నట్టు బుక్‌ చేసుకున్నాకా డెలివరీకి సుమారు 16 వారాల సమయం పడుతుంది. రేస్​మ్యాక్స్​ ఎక్స్​ ఆటోమొబిలి​ లంబోర్ఘిని అనేది ఒక లైట్​వెయిట్​ మోడల్​. దీనిని 3టీ కార్బన్​ పరికరాలతో తయారు చేశారు. ఈ సైకిల్ ఇప్పటికే మార్కెట్​లో ఉన్న ఎక్స్​ప్లోరో రేస్​మ్యాక్స్​ ఎక్స్​ హరికెన్​ స్టెరెట్టో సైకిల్​ను పోలి ఉంది. రెండవ మోడల్​ స్ట్రాడా ఎక్స్​ ఆటోమొబిలిని ప్రత్యేకంగా కంఫర్ట్​, ఎయిరోడైనమిక్స్​ కోసం తయారు చేశారు. ఇందులో ఎస్​ఆర్​ఏఎం ఫోర్స్​ పరికరాలు ఉంటాయి. 3టీతో జతకట్టి లంబోర్ఘిని విడుదల చేసిన మూడవ సైకిల్ ఇది కావడం గమనార్హం​. ఇప్పటికే సంస్థ 2018లో ఆర్​5 ఆటోమొబిలి లంబోర్ఘిని ఎడిషన్ రూపొందించింది.

Updated On 19 Jun 2023 5:58 AM GMT
Ehatv

Ehatv

Next Story