టెస్లా సంస్థ సీఈఓగా ఉన్న ఎలోన్ మస్క్ 2018లో అన్నీ రకాల ప్రయోజనాల్ని కలుపుకుని 55 బిలియన్ డాలర్ల
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మళ్లీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా ఎదిగాడు. ఎలోన్ మస్క్ తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, బెజోస్ ప్రస్తుత నికర విలువ USD 200 బిలియన్లు కాగా.. మస్క్ ఆస్థి USD 198 బిలియన్లకు పడిపోయింది. గత సంవత్సరంలో టెస్లా CEO సుమారు USD 31 బిలియన్లను కోల్పోగా, అమెజాన్ వ్యవస్థాపకుడు USD 23 బిలియన్లను ఆర్జించాడు. టెస్లా కంపెనీ షేర్లు 7.2 శాతం కుప్పకూలిపోవడంతో ఇన్నాళ్లూ తొలిస్థానంలో ఉన్న మస్క్ రెండో స్థానానికి పడిపోయాడు.
టెస్లా సంస్థ సీఈఓగా ఉన్న ఎలోన్ మస్క్ 2018లో అన్నీ రకాల ప్రయోజనాల్ని కలుపుకుని 55 బిలియన్ డాలర్ల వేతనాన్ని తీసుకుంటున్నాడు. మస్క్‌కు అంత వేతనం అవసరమా అంటూ టెస్లా పెట్టుబడిదారుల్లో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు. డెలావర్ కోర్టు ఈ అంశంపై విచారణ చేపట్టింది. కోర్టు తీర్పుతో మస్క్ 55 బిలియన్ డాలర్ల వేతనాన్ని వదులుకోవాలని వచ్చింది. దీంతో టెస్లా షేర్లు పడిపోవడం, ఆ సంస్థలో అత్యధిక షేర్లున్న మస్క్ సంపదపై ప్రతికూల ప్రభావం పడింది. చైనాలోని షాంఘైలోని టెస్లా ఫ్యాక్టరీ నుండి కార్ల ఎగుమతులు పడిపోయాంటూ పలు నివేదికలు రావడంతో టెస్లా షేర్లు మరింత పడిపోయాయి.