డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలతో ప్రపంచ టెక్ పరిశ్రమను ప్రకంపనలు వచ్చాయి.

డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలతో ప్రపంచ టెక్ పరిశ్రమను ప్రకంపనలు వచ్చాయి. చైనా(China)పై కూడా సుంకాలు విధించడంతో యాపిల్ ఐఫోన్ ధరలు 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటి ప్రీమియం మోడళ్ల ధరలు భారతదేశంలో రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చైనాలో చాలా అమెరికా కంపెనీలు తమ యూనిట్లను చైనాలో నెలకొల్పాయి. యాపిల్ సంస్థ కూడా చైనాలో తయారీ సంస్థను ఏర్పాటు చేసింది. అమెరికా విధించిన సుంకాలతో 54 శాతం పన్నును ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో యాపిల్‌ ఫోన్ (Apple Phone)ప్రారంభ ధర రూ.68 వేల నుంచి రూ.97 వేలకు పెరిగే అవకాశం ఉంది. అధునాతన ఏఐ సామర్థ్యాలు, 1 టీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటి ప్రీమియం మోడళ్లు దాదాపు రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉంది. ఏఐ ఫీచర్ల ఆదరణ అంతంత మాత్రమే ఉండడంతో ఐఫోన్‌ కొనేందుకు ముందుకు రావడం లేదు కస్టమర్లు. ఇప్పుడు ఈ సుంకాలతో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున ఐఫోన్‌ కొనేందుకు ఉత్సాహం చూపరని విశ్లేషకులు భావిస్తున్నారు. సుంకాలు ఎదుర్కోలేని శాంసంగ్‌ వంటి ప్రత్యామ్నాయ కంపెనీలపై వినియోగదారులు ఆధార పడే అవకాశం ఉందని చెప్తున్నారు. యాపిల్‌ కంపెనీ వియత్నాం, భారతదేశంలో ఉత్పత్తులను తయారు చేస్తోంది. అయితే వియత్నాంపై 46 శాతం సుంకాన్ని, భారతదేశంపై 26 శాతం సుంకాన్నిట్రంప్‌ (trump) విధించారు. ఇవి చైనా సుంకాల కంటే తక్కువగానే ఉన్నాయి. అయితే కంపెనీ భారతదేశంలో ఉత్పత్తిని పెంచుతుందా లేదా అనే విషయంపై యాప్‌ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

ehatv

ehatv

Next Story