ప్రపంచంలోని అత్యంత కుబేరులు వేలాది కోట్ల విలువైన భవనాల్లో నివాసం ఉంటున్నారు.

ప్రపంచంలోని అత్యంత కుబేరులు వేలాది కోట్ల విలువైన భవనాల్లో నివాసం ఉంటున్నారు. ఇందులో మన దేశ కుబేరులు కూడా ఉన్నారు. భారత్‌తో పాటు ఇతర దేశాల్లో కూడా ఖరీదైన నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇండియాలో అత్యంత కుబేరుడైన ముఖేష్ అంబానీకి ప్రపంచంలో ఎవరికీ లేనంత కాస్ట్‌లీ నివాసం ఉంది. ముంబైలో ఉన్న 27 అంతస్తుల అంబానీ ఇంటి విలువ సుమారు రూ.15 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఇంకా దుబాయ్‌లోని పాంజుమేరాలో బంగ్లా, లండన్‌లో బకింగ్‌హాంషైర్ ఎస్టేట్, మాన్ హట్టన్‌లో లగ్జరీ హోటల్ ఉన్నాయి. లక్ష్మీ మిట్టల్ లండన్‌లో 'బిలియనీర్స్ రో'లో రెండు ఖరీదైన భవనాలను కలిగి ఉన్నారు. ఈ ఇండ్ల విలువ రూ. 2,000 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం. ఇది మాత్రమే కాకుండా.. ఢిల్లీలో కూడా రూ. 31 కోట్ల ఖరీదైన బంగ్లా కలిగి ఉన్నారు. ఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు 'రవి రుయా' 2023లో లండన్‌లోని హనోవర్ లాడ్జ్‌ను రూ. 1,200 కోట్లకు కొనుగోలు చేశారు. ఇది కూడా అత్యంత ఖరీదైన విలాసవంతమైన భవనాలలో ఒకటిగా ఉంది. హిందూజా బ్రదర్స్ ప్రకాష్, అశోక్, శ్రీచంద్, గోపీచంద్.. కార్ల్టన్ హౌస్ టెర్రస్ అనే విలాసవంతమైన లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ దగ్గర ఆరు అంతస్తుల ప్యాలెస్ కలిగి ఉన్నారు. దీనిని 2006లో కొనుగోలు చేశారు. ఇది యూకేలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన భవనాలలో ఒకటిగా ఉంది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన భవనాలలో ఒకటైన 'వరి విల్లా' ను పంకజ్ ఓస్వాల్ కొనుక్కుననారు. 40,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ విల్లా ధర రూ. 1,650 కోట్లు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ 'అదార్ పూనవల్లా' 2023 చివరిలో లండన్‌లోని హైడ్ పార్క్ సమీపంలోని అబెర్‌కాన్‌వే హౌస్‌ను సుమారు రూ. 1,444 కోట్లకు కొనుగోలు చేశారు.
