✕
మన దేశంలో బంగారం నిల్వలు లేనందున దానిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాయి.

x
మన దేశంలో బంగారం నిల్వలు లేనందున దానిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాయి. బంగారం దిగుమతిలో చైనా, భారత్ రెండు దేశాలు ముందు వరుసలో ఉంటాయి. భారత్‌లో బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మహిళలు.. వివాహాలు, శుభకార్యాలు, పండగలు, ఇతర వేడుకలకు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. భారతీయుల వద్ద ఉన్న బంగారం కొన్ని దేశాల రిజర్వు బ్యాంకుల గోల్డ్ నిల్వల కంటే ఎక్కువని HSBC గ్లోబల్ అధ్యయనంలో తేలింది. దాని ప్రకారం భారతీయుల వద్ద 25వేల టన్నులకు పైగా బంగారం ఉంది. దీని విలువ సుమారు రూ.150 లక్షల కోట్లు. భారత్, US, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, జపాన్ వంటి దేశాల రిజర్వు బ్యాంకుల్లోని బంగారం కంటే ఇది ఎన్నో రెట్లు ఎక్కువ. మున్ముందు ఈ నిల్వలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ehatv
Next Story