భారతీయ విస్కీ బ్రాండ్లు అంతర్జాతీయ మార్కెట్‌ను శాసిస్తోంది.

భారతీయ విస్కీ బ్రాండ్లు అంతర్జాతీయ మార్కెట్‌ను శాసిస్తోంది. ఒకప్పుడు భారత్‌కు చెందిన సుగంధ ద్రవ్యాలు, టీలకు ప్రసిద్ధి చెందింది కానీ ఇప్పుడు ఆ స్థానంలో విస్కీ కూడా చేరింది.‘ది స్పిరిట్స్ బిజినెస్ బ్రాండ్ ఛాంపియన్స్ 2024’ నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యధికంగా భారతీయ బ్రాండ్‌లకే డిమాండ్ అధికంగా ఉంది. 5 భారతీయ బ్రాండ్లు టాప్ 10 లో నిలిచాయి. భారతదేశంలో పెరుగుతున్న విస్కీ మార్కెట్, అద్భుతమైన నాణ్యతకు నిదర్శనం. 2023లో అత్యధికంగా అమ్ముడైన విస్కీలో భారతీయ బ్రాండ్లు టాప్ 4 స్థానాలను ఆక్రమించాయి. మెక్‌డోవెల్స్(Mc Dowells) 31.4 మిలియన్ కేసులు అమ్ముడుపోగా.. రాయల్ స్టాగ్(Royal Stag) 27.9 మిలియన్ కేసులతో రెండో స్థానంలో ఉంది. ఆఫీసర్స్ ఛాయిస్(Officers Choice) 23.4 మిలియన్ కేసులు, ఐబీ (Imperial Blue)22.8 మిలియన్ కేసులు కూడా టాప్ 4 లో నిలిచాయి. 5వ స్థానంలో జానీ వాకర్(John Walker) ఉంది. ఇది 22.1 మిలియన్ కేసులను విక్రయించింది. టాప్ 10లో భారతదేశానికి చెందిన 8 PM విస్కీ చోటు దక్కించుకుంది.. ఇది 12.2 మిలియన్ కేసులు అమ్ముడైంది. బ్లెండర్స్ ప్రైడ్(Blenders Pride) 9.6 మిలియన్ కేసులు, రాయల్ ఛాలెంజ్(Royal Challenge) 8.6 మిలియన్ కేసులు, స్టెర్లింగ్ రిజర్వ్(Sterling Reserve) 5.1 మిలియన్ కేసులు వంటి ఇతర భారతీయ బ్రాండ్లు కూడా టాప్ 20లో ఉన్నాయి.

ehatv

ehatv

Next Story