ప్రముఖ ఓటీటీ యాప్ జియోహాట్ స్టార్ సరికొత్త చరిత్రను సృష్టించింది.

ప్రముఖ ఓటీటీ యాప్ జియోహాట్ స్టార్ సరికొత్త చరిత్రను సృష్టించింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025(ChampionsTrophy2025)కి అధికారిక ఓటీటీ బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తున్న జియో హాట్‌స్టార్ భారత్-పాకిస్థాన్(India-Pakistan ) హైఓల్టేజ్‌ మ్యాచ్‌కు అత్యధిక వ్యూస్‌ లభించి రికార్డులను నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతో జియోహాట్ స్టార్ పంట పండింది. ఈ మ్యాచ్‌లో గరిష్టంగా 61 కోట్ల కంకరెంట్ వ్యూస్ నమోదయ్యాయి. ఓకే సమయంలో వచ్చే వ్యూస్‌ సంఖ్యను కంకరెంట్ వ్యూస్‌ అంటారు. ఈ మ్యాచ్‌ను ఏకకాలంలో 61 కోట్ల మంది చూశార. పాక్‌ ఇన్నింగ్స్‌ జరుగుతున్న సమయంలో 40 కోట్లకు చేరిన ఈ సంఖ్య.. భారత్‌ బ్యాటింగ్‌కు దిగేసరికి 55 కోట్లకు చేరింది. దీనికి కోహ్లీ తోడయ్యాడు. అద్భుత సెంచరీ చేసి మ్యాచ్‌ను ఏకపక్షంగా తీసుకెళ్లిన కోహ్లీ సెంచరీ సమయంలో ఈ వ్యూస్ 61 కోట్లకు పెరిగింది. ఇది ఓటీటీ యాప్(OTT App) చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డ్. ఈ మధ్యనే జీయో-హాట్‌స్టార్‌(JioHotstar) కలిసిపోయాయి. ఓటీటీ రంగంలో శత్రువులుగా ఉంటే నష్టాలు తప్పవని భావించి ఈ రెండు సంస్థలు ఒక్కటై పక్కా ప్లానింగ్‌తో జియో హాట్‌స్టార్‌గా బరిలోకి దిగాయి. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను ఫ్రీగా ప్రసారం చేస్తున్నప్పటికీ.. ఐపీఎల్ మ్యాచ్‌లకు డబ్బులు కట్టాల్సింది. కనీసం రూ. 149తో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. జియో మొబైల్ యూజర్లకు కొన్ని ప్రత్యేకమైన రిచార్జ్ ప్లాన్స్‌ తీసుకొచ్చి ఫ్రీగా జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఇస్తోంది.

ehatv

ehatv

Next Story