రియల్ ఎస్టేట్(Real estate) వ్యాపారం రోజురోజుకు పడిపోతుంది.
రియల్ ఎస్టేట్(Real estate) వ్యాపారం రోజురోజుకు పడిపోతుంది. మరోవైపు హైడ్రాతో(Hydra) జనంలో భయాందోళనలు నెలకొన్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల(Registrations) ద్వారా గత నెలతో పోలిస్తే రూ.320 కోట్ల మేర ఆదాయం తగ్గిపోయింది. హైడ్రా కూల్చివేతల ప్రభావం రిజిస్ట్రేషన్ల శాఖపై చూపిస్తోంది. జూలై నెలతో పోలిస్తే భారీగా రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. జూలై నెలలో జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజ్గిరి, సంగారెడ్డిలో 58,000 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఆగస్టులో 41,200 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. జూలైలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.1105 కోట్ల ఆదాయం రాగా, ఆగస్టులో రూ.320 కోట్ల మేర ఆదాయం తగ్గి రూ.785 కోట్లకి పడిపోయింది. హైడ్రా భయంతో రేరా, హెచ్‌ఎండీఏ అప్రూవ్ ఇచ్చిన ప్రాజెక్టుల్లో ఫ్లాట్‌లు, ప్లాట్‌లు కొన్నవారు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నారు. బుక్ చేసిన వాటిని క్యాన్సల్ చేసుకోవడంతో రిజిస్ట్రేషన్ల వరకు పోకపోవడంతోనే ఆదాయం తగ్గిందని రియల్ ఎస్టేట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.