దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన HDFC బ్యాంక్ కస్టమర్లకు షాకిచ్చింది

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన HDFC బ్యాంక్ కస్టమర్లకు షాకిచ్చింది. తన రుణ రేట్లను పెంచేసింది. HDFC బ్యాంక్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లు(MCLR) పెంచింది. ఈ నిర్ణయంతో గృహ రుణాలు, కారు రుణాలు, వ్యక్తిగత రుణాలు కాస్త ప్రియంగా మారాయి. ఇకపై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన కస్టమర్‌లకు అధిక వడ్డీకి రుణాలను అందించనుంది. HDFC బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్లను అంటే MCLRని 10 బేసిస్ పాయింట్లు అంటే 0.10 శాతం పెంచింది.

ఎంపిక చేసిన కొన్ని టెన్యూర్లపై వడ్డీ రేట్లు పెరిగాయి. ఈ నిర్ణయం 2024, ఫిబ్రవరి 8 నుంచి అమల్లోకి వస్తుందని HDFC బ్యాంక్ స్పష్టం చేసింది. ఎంసీఎల్ఆర్ పెంచితే ఆయా లోన్లపై ఈఎంఐ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఇప్పటికే లోన్లు తీసుకున్నవారికి లోన్ టెన్యూర్ పెరుగుతుంది. ఎంసీఎల్ఆర్ అనేది బ్యాంకులు కస్టమర్‌కు లోన్‌పై ఇచ్చే కనీస వడ్డీ రేటు. అంతకంటే తక్కువ మొత్తానికి లోన్ ఇచ్చేందుకు వీలుండదు. అన్ని బ్యాంకులు ఒకే పద్ధతి పాటించాలనే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఈ విధానం తీసుకొచ్చింది. దాదాపు ప్రతి బ్యాంక్ కూడా ప్రతి నెలా RBI రెపో రేట్లపై తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈ ఎంసీఎల్ఆర్ రేట్లు సవరిస్తుంటాయి. ఆర్బీఐ గత 5 విడతలుగా రెపో రేటును 6.50 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తూ వస్తుంది. వివిధ కాలపరిమితి కలిగిన రుణాల కోసం బ్యాంక్ MCLR రేటు 8.9 శాతం నుండి 9.35 శాతం మధ్య ఉంది.

Updated On 7 Feb 2024 11:03 PM GMT
Yagnik

Yagnik

Next Story