✕
ఇప్పటి వరకు గూగుల్ పే ప్లాట్‌ఫారమ్‌లో పూర్తి ఉచితంగా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు కదా.

x
ఇప్పటి వరకు గూగుల్ పే ప్లాట్‌ఫారమ్‌లో పూర్తి ఉచితంగా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు కదా. కానీ ఇప్పుడు ఈ యూనిఫైడ్ ఇంటర్‌ఫేస్ పేమెంట్స్ (యూపీఐ)పై గూగుల్ పే కన్వీనియెన్స్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజుల్లో చాలా మంది కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లులు చెల్లించేందుకు యూపీఐ పేమెంట్స్‌నే ఎక్కువగా చేస్తున్నారు. అందుకే దీనిని అడ్వాంటేజ్‌గా తీసుకొని క్యాష్ చేసుకునేందుకు గూగుల్ సిద్ధమైనట్లు సమాచారం. ప్రధానంగా క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చేసే యూపీఐ పేమెంట్స్‌పై 0.5 శాతం నుంచి 1 శాతం వరకు అదనపు ఫీజు వసూలు చేయననున్నట్లు సమాచారం. గూగుల్ పే దాదాపు ఒక ఏడాది క్రితం మొబైల్ రీఛార్జ్‌ల కోసం రూ.3 కన్వీనియెన్స్ ఫీజు ప్రవేశపెట్టింది. ఇప్పుడు యూపీఐ పేమెంట్స్‌పై కూడా ఇలాంటి రుసుము వసూలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ehatv
Next Story