చికెన్ ధరలు అమాంతం పడిపోయాయి. మొన్నటి వరకు ట్రిపుల్ సెంచరీ ఉన్న కేజీ చికెన్ ధ‌ర‌.. శ్రావణ మాసం ఎఫెక్ట్‌తో రేటు తగ్గుముఖం పట్టింది. శ్రావణ మాసంలో చాలా మంది మాంసం తిన‌రు. అంతేకాకుండా అధిక ధరల కారణంగా ప్ర‌జ‌లు చికెన్ కొనుగోలు చేసేందుకు కూడా వెనుకంజ వేస్తున్నారు.

చికెన్ ధరలు(Chicken Price) అమాంతం పడిపోయాయి. మొన్నటి వరకు ట్రిపుల్ సెంచరీ(Triple Century) ఉన్న కేజీ చికెన్ ధ‌ర‌(KG Chicken Price).. శ్రావణ మాసం(Sravana Masam) ఎఫెక్ట్‌తో రేటు తగ్గుముఖం పట్టింది. శ్రావణ మాసంలో చాలా మంది మాంసం తిన‌రు. అంతేకాకుండా అధిక ధరల కారణంగా ప్ర‌జ‌లు చికెన్ కొనుగోలు చేసేందుకు కూడా వెనుకంజ వేస్తున్నారు. దీంతో డిమాండ్(Demand) లేక చికెన్ ధ‌ర‌ తగ్గుముఖం పట్టింది. దాదాపు రెండు నెలల పాటు కిలోకు రూ.300 నుంచి రూ.340 వరకు పలుకగా.. గడిచిన వారం రోజుల్లో ఏకంగా రూ.100 మేర తగ్గింది. ప్రస్తుతం మార్కెట్‌ లో కిలో లైవ్ బర్డ్(Live Bird) ధ‌ర రూ.130 ఉండ‌గా.. స్కిన్(Skin) కిలో రేటు రూ.200, స్కిన్ లెస్(Skinless) కేజీ ధ‌ర‌ రూ.230 ఉంది. మరో రెండు, మూడు నెలల పాటు ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని చికెన్ సెంటర్ల యజమానులు తెలిపారు. ధ‌ర త‌గ్గ‌డంతో చికెన్ ప్రియులు(Chiken Lovers) సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Updated On 10 July 2023 9:48 PM GMT
Yagnik

Yagnik

Next Story