అమెరికా బ్యాంకు వైఫల్యం తో బంగారం ధరలు గత కొన్ని వారాల కంటే అత్యధికంగా పెరిగాయి. దీంతో పెట్టుబడిదారులు బంగారం పై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

స్టాక్ మార్కెట్ పైన జాతీయ , అంతర్జాతీయ ప్రతికూల అంశాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో మదుపు దారులు బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్య ఒకసారి పసిడి ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ ఒక్క సారిగా పెరిగాయి . దీనికి కారణం అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ తో పాటు సిగ్నేచర్ బ్యాంకు మూసివేత , అమెరికా డాలర్ విలువ పతనం అవ్వడమే . ద్రవ్యోల్భణం కట్టడికి ఓ వైపు ఫెడ్ రేట్ల పెంపు వంటి పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బ తీస్తున్నాయి. దీనివల్లనే ధరలు పెరుగుతున్నట్లు హెచ్ డిఎఫ్ సీ సెక్యూరిటీ నివేదిక చెబుతుంది.

అయితే రిసెంట్ గా మార్చి 13 న ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 970 పెరిగి రూ. 56,550 కు చేరింది. విదేశీ మార్కెట్లో బంగారం ఔన్స్ కు 1,875 డాలర్లు , వెండి 20.75 వద్ద ట్రేడ్ జరిగినట్లు హెచ్ డీఎఫ్ సీ సెక్యూరీటిస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. 2008 ఆర్ధిక మాంధ్యం తర్వాత అతిపెద్ద అమెరికా బ్యాంకు వైఫల్యం తో బంగారం ధరలు గత కొన్ని వారాల కంటే అత్యధికంగా పెరిగాయి. దీంతో పెట్టుబడిదారులు బంగారం పై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారణంగానే బంగారానికి ఇంత డిమాండ్ ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు.

Updated On 14 March 2023 12:12 AM GMT
Ehatv

Ehatv

Next Story