ఈ క్రమంలో ఢిల్లీలో బంగారం, వెండి ధరలు నిన్న ఒక్కరోజే భారీగా తగ్గుముఖం పట్టాయి.

నగల వర్తకులు, కొనుగోలు దారుల నుంచి గిరాకీ పెరగడం తో బంగారం అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో బంగారం, వెండి ధరలు నిన్న ఒక్కరోజే భారీగా తగ్గుముఖం పట్టాయి. మళ్లీ తులం బంగారం (24 క్యారట్స్) ధర 80 వేల రూపాయల దిగువకు చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ధోరణి కూడా దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గడానికి కారణమయ్యింది. నిన్న 24 క్యారట్ల బంగారం తులం ధర 1,400 రూపాయలు తగ్గి 79,500 రూపాయలకు పడిపోయింది. మొన్న అంటే గురువారం తులం బంగారం ధర రూ.80,900 ఉండింది. మరోవైపు, కిలో వెండి ధర 4,200 రూపాయలు తగ్గి 92,800 రూపాయలకు పడిపోయింది. డిసెంబర్ నెలలో భారీగా వెండి ధర పతనం కావడం ఇదే మొదటిసారి. గురువారం కిలో వెండి ధర 97,000 రూపాయలు పలికింది.

ehatv

ehatv

Next Story