బంగారం ధరలు(Gold Price) నెమ్మదిగా దిగివస్తున్నాయి.

బంగారం ధరలు(Gold Price) నెమ్మదిగా దిగివస్తున్నాయి. పదిరోజుల కిందట ఆల్‌టైమ్‌ హైలను తాకిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. సోమవారం కూడా పసిడి రేటు 600 రూపాయలు పడిపోయింది. హైదరాబాద్‌లో(Hyderabad) తులం 24 క్యారెట్‌ (99.9 స్వచ్ఛత) 78,760 రూపాయల దగ్గర నిలిచింది. . 22 క్యారెట్‌ (99.5 స్వచ్ఛత లేదా బంగారు ఆభరణాలు) 10 గ్రాములు 550 రూపాయలు తగ్గి 72,200 రూపాయల దగ్గర స్థిరపడింది. అయితే ఢిల్లీలో (Delhi)24 క్యారెట్‌ తులం బంగారం విలువ 79,550 రూపాయలుగా ఉంది. గతంతో పోల్చితే 450 రూపాయలు తగ్గింది. దీపావళి(diwali) రోజున ఆల్‌టైమ్‌ హైని తాకుతూ 24 క్యారెట్‌ పసిడి ధర తులం 82,400 రూపాయలు పలికింది. కానీ ఈ పది రోజు ల్లో మూడు నుంచి మూడున్నర వేల రూపాయలు తగ్గింది. వెండి ధరలూ కూడా తగ్గుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.600 పడిపోయి రూ.94,000కు పరిమితమైంది.

Eha Tv

Eha Tv

Next Story