భారతదేశంలో తొందరలోనే భారీగా ఉద్యోగకోతలు రాబోతున్నాయని ఒక సర్వే వెల్లడించింది .దీనితో మళ్లీ నిరుద్యోగ సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తుంది . ఈ మధ్యకాలంలో ఉద్యోగస్తుల కోత భారీగానే కనిపిస్తుంది .ఈ తరుణంలో జీనియస్ కన్సల్టెంట్స్Genius Consultants నిర్వహించిన సర్వే ఫలితాలు అందరికి ఆందోళన కలిగిస్తున్నాయి
భారతదేశంలో తొందరలోనే భారీగా ఉద్యోగకోతలు రాబోతున్నాయని ఒక సర్వే వెల్లడించింది .దీనితో మళ్లీ నిరుద్యోగ సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తుంది . ఈ మధ్యకాలంలో ఉద్యోగస్తుల కోత భారీగానే కనిపిస్తుంది .ఈ తరుణంలో జీనియస్ కన్సల్టెంట్స్Genius Consultants నిర్వహించిన సర్వే ఫలితాలు అందరికి ఆందోళన కలిగిస్తున్నాయి.
జీనియస్ కన్సల్టెంట్స్ Genius Consultants అధ్యయనం ప్రకారం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా భారతదేశంలోని 71 శాతానికి పైగా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని తాజాగా ప్రకటించింది . భారతీయ ట్రేడింగ్ మార్కెట్‌లోని ప్రజలు ఇప్పటికే తమ ఖర్చు కొలమానాలను తగ్గించుకున్నందున చాలా ప్రముఖ కంపెనీలు రోజువారీ ట్రేడింగ్ పరిమాణంలో క్షీణతను చూస్తున్నాయి. ఇదొక్కటే కాదు, మార్కెట్లో కొత్త పెట్టుబడులు కూడా గణనీయంగా తగ్గాయి.
గత కొద్దికాలంగా ఐటీ రంగంలో(IT Industry) షేర్లు భారీగా నష్టాలను చూస్తున్నాయి .అలాగే సేల్స్ రంగంలో(Sales Industry) కంపెనీలు సైతం ఇప్పటికే కొన్ని వందల మంది ఉద్యోగస్తులకు లే ఆఫ్ ఇస్తున్నాయి .ప్రముఖ కంపెనీలు Twitter,Infosys ,Microsoft,Amazon,tcs, వంటి భారీ కంపెనీలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి .ఎంతో మంది ఉద్యోగస్తులను ఇంటికి పంపేస్తున్నాయి . దీనితో సాఫ్ట్ వేర్ ఉద్యోగాల పరిస్థితి గాల్లో దీపంలా మారింది .
జీనియస్ కన్సల్టెంట్స్ Genius Consultants నివేదిక ప్రకారం 71 శాతం కంటే ఎక్కువ భారతీయ కంపెనీలను తొలగించే ఉన్నట్లు వెల్లడించింది,అలాగే ఇతర ముఖ్యమైన అంశాలను కూడా జాబితా చేసింది. జీనియస్ కన్సల్టెంట్స్ సర్వే చేసిన ప్రకారం 36 శాతం భారతీయ కంపెనీలు కేవలం అధిక నియామకాల కారణంగానే ఉద్యోగాల తొలగింపులు జరుగుతున్నాయని నివేదించటమైంది . మిగిలిన కంపెనీలలో, 30 శాతం మంది ఖర్చు తగ్గించే కారణంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు నివేదించారు. దీనికి తోడు ఆర్థిక మాంద్యం కూడా ఉద్యోగుల తొలగింపుకు కారణమని 23 శాతం కంపెనీలు చెబుతున్నాయి.పరిస్థితి చూస్తుంటే మరో సారి నిరుద్యోగ సమస్య ఇండియాకి ఒత్తిడి కలిగించేలా ఉందా? అనిపిస్తుంది .