బ్యాంకు అగ్రగ్రామి sbi బ్యాంకు Yono యాప్ ద్వారా లావాదేవీలు జరుపుతున్న సదరు వినియోగదాలను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది . ప్రియమైన వినియోగదారులకు మీ యోనా బ్యాంకు ఖాతా త్వరలో బ్లాక్ అవుతుంది

ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి.. వినియోగదారులను యేమార్చి బ్యాంకు ఖాతాలోని డబ్బుల్ని క్షణాల్లో మాయం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.. ఈ సమయంలో వారి ఆధార్ కార్డు పాన్ కార్డు వంటి వాటిని కూడా దుర్వినియోగం చేసి బ్యాంకుల్లోనే ఉన్న డబ్బును కాజేస్తున్నారు . మీరు తెలియక మీ ఆధార్ లేక పాన్ కార్డు లేదా వేలిముద్రలని ఎక్కడైనా సరే. అజాగ్రత్తగా వినియోగించినట్లయితే తప్పకుండా మీరు చిక్కుల్లో పడ్డట్టే అనే విషయం మర్చిపోవద్దు.. ఇక మొబైల్ ద్వారా కూడా గుర్తింపు ఉన్న బ్యాంకుల నుంచి మెసేజ్లు రావడం తెలియక వాటిని క్లిక్ చేయడం ద్వారా మీ అకౌంట్లో ఉన్న డబ్బులు నిమిషాల్లో మాయం అవుతున్నాయి ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్న ఈ మోసాలు ఎక్కువ అవడం రోజు మనం వింటూనే ఉన్నాం.

బ్యాంకు అగ్రగ్రామి sbi బ్యాంకు Yono యాప్ ద్వారా లావాదేవీలు జరుపుతున్న సదరు వినియోగదాలను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది . ప్రియమైన వినియోగదారులకు మీ యోనా బ్యాంకు ఖాతా త్వరలో బ్లాక్ అవుతుంది. పాన్ నెంబర్ ని అప్డేట్ చేసుకోవటానికి మరింత సమాచారం కోసంమీకు మెసేజ్ రూపం లో పంపబడిన లింక్ పై క్లిక్ చేయగలరు . అంటూ మోసపూరిత మెసేజ్ ,కాల్స్,మెయిల్స్ వంటివి పంపుతూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు . ఆలా లింక్ పైన తెలియక క్లిక్ చేసిన వెంటనే నిమిషాలలో మీ అకౌంట్ లో డబ్బుని లాగేస్తారు. ఎలాంటి మోసపూరిత మెసేజెస్ వచ్చినపుడు రిపోర్ట్ చేయటం లేదా @ sbi .co .in లో రిపోర్ట్ చేయాలనీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పి ఎస్ బి )తెలిపింది .

అకౌంట్ నెంబర్ ,పాస్వర్డ్ ,ఓటీపీ తోసహా ఇతర బ్యాంకు సంబందించి సమాచారాన్ని ఎవరితో పంచుకోవడం కానీ ,మెసేజ్ ల రూపం లో వీటిని ఇంటర్నెట్ ద్వారా షేర్ చేయటం ప్రమాదకరం అని sbi సూచిస్తోంది . ఇలా లింక్స్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి సైబర్ నేరాలకు పాల్పడం జరుగుతుంది . సైబర్ నేరాలకు సంబంధించి నేరుగా ఫిర్యాదులు చేయాలంటే 1930 నెంబర్ కు ఫోన్ చేసి తెలుపగలరు .

Updated On 13 March 2023 5:08 AM GMT
Ehatv

Ehatv

Next Story