గతంలో ఫ్లిప్‌కార్ట్ కి పనిచేసిన ఎగ్జిక్యూటివ్‌లు అయిన సమీర్ నిగమ్,రాహుల్ చారి, బర్జిన్ ఇంజినీర్ అనే ముగ్గురు 2015లో ఫోన్ పే యాప్‌ను తీసుకువచ్చారు . యూపీఐ పేమెంట్ యాప్ ఫోన్ పే (Phone Pe) ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) నుంచి బయటకొచ్చేసింది. . ఇకమీదట ఫోన్ పే అప్ భారతీయ సంస్థగా పనిచేయబోతుంది ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే మధ్య యాజమాన్య హక్కులను బదిలీ ప్రక్రియ ముగిసిన సందర్భం లో రెండు కంపెనీలు ఇకపైన […]
గతంలో ఫ్లిప్‌కార్ట్ కి పనిచేసిన ఎగ్జిక్యూటివ్‌లు అయిన సమీర్ నిగమ్,రాహుల్ చారి, బర్జిన్ ఇంజినీర్ అనే ముగ్గురు 2015లో ఫోన్ పే యాప్‌ను తీసుకువచ్చారు .
యూపీఐ పేమెంట్ యాప్ ఫోన్ పే (Phone Pe) ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) నుంచి బయటకొచ్చేసింది. . ఇకమీదట ఫోన్ పే అప్ భారతీయ సంస్థగా పనిచేయబోతుంది ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే మధ్య యాజమాన్య హక్కులను బదిలీ ప్రక్రియ ముగిసిన సందర్భం లో రెండు కంపెనీలు ఇకపైన విడివిడిగా తమ కార్యకలాపాలు నడిపిస్తాయి .
ఈ రెండింటికి చెందిన ప్రధాన షేర్ హోల్డర్ యూస్ రిటైల్ సంస్థ అయిన వాల్ మార్ట్. ఫోన్ పే ను 2016 లోFlip kart సంస్థ కొనుగోలుచేసింది ఫోన్ పే, ఫ్లిప్‌కార్ట్ కంపెనీల సింగపూర్ ఎంటిటీస్‌కు చెందిన షేర్ హోల్డర్స్ ఫోన్ పే ఇండియా నుంచి నేరుగా షేర్లను కొనుగోలు చేశారు. దాంతో ఫోన్ పే ఇకపై పూర్తిగా భారత్‌కు చెందిన కంపెనీ అవుతుందని ప్రకటించారు. . దీంతో ఫోన్ పే త్వరలో ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్)లో చేరనుంది.