ఏదైనా పెట్టుబడిలో నష్టభయం ఎక్కువగా ఉంటే, రాబడి ఎక్కువగా ఉంటుంది.

ఏదైనా పెట్టుబడిలో నష్టభయం ఎక్కువగా ఉంటే, రాబడి ఎక్కువగా ఉంటుంది. కానీ చాలామంది రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. ఇలాంటి వారికి బ్యాంకు డిపాజిట్లు బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్‌గా చెప్పుకోవచ్చు.అయితే త్వరలో డిపాజిట్ రేట్లు తగ్గే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఈ సమయంలో ట్రెడిషనల్ బ్యాంక్ డిపాజిట్లకు బదులుగా, ఎక్కువ రిటర్న్ ఆఫర్ చేసే కార్పొరేట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడం మంచిదని సూచిస్తున్నారు.కార్పొరేట్ డిపాజిట్ల వడ్డీ రేట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే 150 నుంచి 200 బేసిస్ పాయింట్లు (bps) ఎక్కువగా ఉంటాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో (SFB) వడ్డీ రేట్లు 100 నుంచి 150 bps ఎక్కువగా ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 సంవత్సరాల FDకి 6.5% వడ్డీ అందిస్తుండగా.. ఇదే టెన్యూర్‌కు శ్రీరామ్ ఫైనాన్స్ 8.47%, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.2% వడ్డీ అందిస్తోంది.
