డిస్నీలో(Disney) భారీగా ఉద్యోగాల కోత . తాజాగా సోమవారం 4 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు నోటీసులు జారీచేసినట్లు సమాచారం . గతంలో కూడా వేల సంఖ్యలో ఉద్యోగాలు తొలగించగా, రెండో రౌండ్లో కూడా భారీ సంఖ్యలో ఉద్యోగస్తులను తొలగించటం జరుగుతుంది . వేసవి మొదలయ్యే లోపే మూడో రౌండ్లో మరికొంతమంది ఉద్యోగాలు కోల్పోతారని తెలిపిన ముందస్తు సమాచారంతో ఉద్యోగస్తులు పరిస్థితి ఆందోళనకరంగా మారింది .

డిస్నీ(Disney) విభాగం నుండి మొత్తం 7 వేల మంది ఉద్యోగులను తొలగించాలని భావిస్తున్నట్లు ముందే ప్రకటించింది . దీని ద్వారా సుమారు 5.5 బిలియన్ డాలర్ల మేర ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్నట్లు డిస్నీ సంస్థ భావిస్తోంది.రెండో రౌండ్ లో డిస్నీ ఎంటర్టైన్మెంట్ , ESPN, అలాగే డిస్నీ పార్క్స్, ఉత్పత్తులు విభాగంలో అమెరికాలోని,Burbank, క్యాలీఫోర్నియా(California), న్యూయార్క్(New york), కనెక్టికట్(Connecticut ) ప్రాంతాల్లో పనిచేసే వారిపై ఈ ప్రభావం ఉండనుంది.ఆర్థిక అస్థిరతల ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా డిస్నీకి వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయినట్లు నివేదిక పేర్కొంది. దీంతో ఉద్యోగులను తొలగించక తప్పటం లేదని , మా ఉద్యోగుల ప్రతిభ, అంకితభావం పట్ల నాకు అపారమైన గౌరవం ఉందని డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్(Disney CEO Bob Iger) తెలిపారు.