Citroën కంపెనీ ఇటీవలే Citroen C3( Citreon C3 Aircross)ఎయిర్‌క్రాస్‌ను మార్కెట్ లో విడుదల చేసింది . ఇది భారతదేశంలో సిట్రోయెన్ C3 కంపెనీ విడుదల చేసిన నాల్గవ మోడల్, ఈ మోడల్ లో ఎలక్ట్రిక్ కారు కూడా అందుబాటులో ఉంది. బెస్ట్ లుక్ డిజైన్ తో పాటు స్పేస్ పరంగా కూడా అత్యుత్తమ పెర్ఫార్మన్స్ ఇవ్వబోయే SUVగా నిరూపించుకోబోతోందని సిట్రాన్ పేర్కొంది.మీరు కూడా కొత్త SUVమోడల్ కారును కొనాలి అనుకుంటున్నారా , C3 Air cross గురించి ఒకసారి తెలుసుకొండి.

Citreon C3 ఎయిర్‌క్రాస్(Citreon C3 Aircross) లుక్స్ ఇంకా డిజైన్
కారు ముందు భాగంలో స్ప్లిట్-హెడ్‌ల్యాంప్ సెటప్, సిగ్నేచర్ Y- షేప్ LED DRLలు ,ఇంటిగ్రేటెడ్ సిట్రోయెన్ లోగోతో కూడిన గ్రిల్ ఉన్నాయి. సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ (Citreon C3 Aircross) సైడ్ ప్రొఫైల్ 4-స్పోక్ డ్యూయల్-టోన్ తో పాటు 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఉంటుంది. బ్యాక్ సైడ్ , ఇది పెద్ద టెయిల్‌గేట్, స్క్వేర్ షేప్ టెయిల్-ల్యాంప్‌లు ఇంకా C3 లాంటి పొడవైన బంపర్‌తో వస్తుంది . ఈ SUV పొడవు 4.3 మీటర్లు ,వీల్‌బేస్ 2,671 మిమీ. Citroen C3 ఎయిర్‌క్రాస్ గ్రౌండ్ క్లియరెన్స్ 200mm అలాగే ఇది 511 లీటర్ల వరకు బూట్ స్పేస్‌ను అందిస్తుంది.

సీటింగ్ కెపాసిటీ అలాగే స్పేస్
ఈ SUVలో మీరు చాలా స్పేస్ పొందగలరు , బ్యాక్ బూట్‌లో మీరు మొత్తం 511 లీటర్ల బూట్ స్పేస్‌ను పొందుతారు, కానీ ఆ సమయంలో కేవలం 5 సీట్లను మాత్రమే యాక్సెస్ చేయవచ్చు, మీరు సెవెన్ సీటర్ కాన్ఫిగరేషన్‌ను ఓకే చేసిన వెంటనే, బ్యాక్ బూట్ స్పేస్ క్లోజ్ అవుతుంది . సెకండ్ రో , థర్డ్ రో లోకూర్చునే వారి కోసం రూఫ్ మౌంటెడ్ AC వెంట్లు అందించారు . ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్లు కూడా అందించబడుతుంది.

5 ఫాస్ట్ ఛార్జింగ్ USB పోర్ట్
ఈ 5 ఫాస్ట్ ఛార్జింగ్ USB పోర్ట్‌లు చాలా తక్కువ వాహనాల్లో కనిపిస్తాయి. దీంతో మీ మొబైల్ ఫోన్ ను ఫాస్ట్ చార్జింగ్ చేసుకోవచ్చు . ముందు వరుసలో 1 USB పోర్ట్, మధ్య వరుసలో 2 , వెనుక వరుసలో 2పోర్టులు ఉంటాయి.

Updated On 29 April 2023 4:37 AM GMT
rj sanju

rj sanju

Next Story